కరోనా ఎఫెక్ట్: అమూల్ హల్దీ (పసుపు) ఐస్ ‌క్రీమ్... టేస్ట్ చేసారా...?

ప్రస్తుతం ప్రపంచంలో కరోనా మహమ్మారి ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే ఈ కరోనా మహమ్మారి ని అదుపు చేయడంలో భాగంగా అనేక దేశాలు లాక్ డౌన్ ప్రక్రియని అమలు చేసిన విషయం అందరికీ తెలిసిందే.

దీంతో ఉద్యోగస్తులు వారి ఉద్యోగాలను ఇంటి నుంచే చేయడం మొదలుపెట్టారు.అయితే కొందరు వ్యక్తులు మాత్రం లాక్ డౌన్ సమయంలో మెదడుకి పని ఎక్కువగా పెడుతున్నారు.

Amul Realses Haldi Ice Cream Amul, Haldi Ice Cream, Twitter, Social Media-క�

ఇక అసలు విషయంలోకి వెళితే.కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే చల్లని పదార్థాలు తీసుకోవద్దని డాక్టర్లు అనేకమార్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో భారతదేశ బ్రాండ్ అమూల్ వ్యాధి నిరోధక శక్తిని పెంచే తులసి, పసుపు, అల్లం వంటి వివిధ ప్రత్యేక ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తుంది.ఇక తాజాగా వీటిలో పసుపుతో చేసిన ఐస్ క్రీమ్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది అమూల్.

Advertisement

వీటిని తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తి మన శరీరంలో పెరుగుతుందని సంస్థ తెలియజేసింది.ఈ విషయాన్ని అమూల్ కంపెనీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది.

అయితే దీనిని కేవలం పసుపుతో మాత్రమే చేయలేదని అందులో పాలు, తేనె, మిరియాలపొడి, జీడిపప్పు లాంటి పదార్థాలు ఉపయోగించినట్టు కంపెనీ తెలియజేసింది.అలాగే కేవలం పసుపు ఫ్లేవర్ ఐస్ క్రీం మాత్రమే కాకుండా.

తులసి ఫ్లేవర్ ఐస్ క్రీం, అల్లం ఐస్ క్రీం ఫ్లేవర్స్ లను విడుదల చేస్తున్నట్లు అమూల్ కంపెనీ తెలిపింది.ఈ మధ్యకాలంలో అనేక దేశీయ ఉత్పత్తి సంస్థలు వ్యాధి నిరోధకశక్తి పెంచేందుకు సుగంధద్రవ్యాలని తినే ఆహార పదార్థాలలో కలవడం జరుగుతుంది.

అయితే నిజానికి పసుపు, పాలు అనేది రోగనిరోధక శక్తికి మంచి సపోర్ట్ ఇచ్చే కాంబినేషన్.అయితే అమూల్ ని అమితంగా ఆదరించే భారతీయులు ఈ ఐస్ క్రీం పై మాత్రం కాస్త భిన్నంగా స్పందిస్తున్నారు.

స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్, టైట్నింగ్ కు ఉపయోగపడే రెమెడీ ఇది.. డోంట్ మిస్!

నెటిజన్లు ఇందుకుగాను వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.కొందరు నెటిజన్లు క్రియేటివిటీ ఎక్కువైందని, మరి ఇంత అయితే కష్టమని కామెంట్ చేస్తున్నారు.

Advertisement

మరికొందరు అమూల్ పై నాకు పూర్తి నమ్మకం ఉంది, నాకు కొత్త ఫ్లవర్స్ ట్రై చేయడం అంటే చాలా ఇష్టం.ఇందుకు అమూల్ నన్ను డిసప్పాయింట్ చేయదని భావిస్తున్నాను అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

అయితే మొత్తానికి ఈ పసుపు ఐస్ క్రీమ్ ను మాత్రం అంతగా సపోర్ట్ చేయలేక పోతున్నారు భారతీయులు.

తాజా వార్తలు