ఈ ఇద్దరు డైరెక్టర్ లో నాగార్జున వందో సినిమా చేసే డైరెక్టర్ ఎవరంటే..?

ప్రస్తుతం నాగార్జున( Nagarjuna) వరుస సినిమాలు చేస్తూ ముందుకు కదులుతున్నాడు.

ఇక ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన నా సామి రంగా( Naa Saami Rang ) సినిమా భారీ డిజాస్టర్ ను మూట కట్టుకుంది.

ఇక అందులో భాగంగానే ప్రస్తుత నాగార్జున 99 సినిమాలను పూర్తిచేసుకొని తన వందో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.ఇక ఈ క్రమంలో ఎలాంటి సినిమాని తన వందో సినిమా కోసం ఎంచుకోవాలి అనే డైలామా లో అయితే నాగార్జున ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక నాగార్జున ఆస్థాన దర్శకుడిగా మంచి గుర్తింపు ను సంపాదించుకున్న కళ్యాణ్ కృష్ణ( Kalyan Krishna ) నాగార్జున తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఆయన ఇప్పటికే నాగార్జున వందో సినిమా కోసం కథ రెడీ చేసి పెట్టుకున్నారట.ఈ కథను నాగార్జునకు చెప్పినప్పటికీ ఆయన నుంచి ఇంకా ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో నాగార్జున జడ్జిమెంట్ కోసమే అతను ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే సినిమా చూపిస్త మామ, నేను లోకల్ లాంటి సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్న ప్రసన్నకుమార్ బెజవాడ( Prasanna Kumar Bezawad ) కూడా నాగార్జునకి ఒక మంచి కథను వినిపించారట.

Advertisement

అయితే ఈ కథ విషయంలో నాగార్జున నచ్చినట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ సినిమాకి ఓకే చెప్పాలా లేదంటే ప్రసన్నకుమార్ చెప్పిన కథతో సినిమాకి ఓకే చెప్పాలా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి ఇలాంటి క్రమంలో ఆయన ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.

ఇక కళ్యాణ్ కృష్ణ తో సినిమా చేయాలి అంటే ఆయన చెప్పిన కథకి ఆయన పూర్తిగా సాటిస్ఫై అవ్వలేదు.ప్రసన్నకుమార్ బెజవాడ కథ పూర్తిగా సాటిఫై చేసినప్పటికీ ఆయనకి డైరెక్షన్ పరంగా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి తన వందో సినిమాని ఒక కొత్త డైరెక్టర్ కి ఇచ్చే ఉద్దేశ్యం లో నాగార్జున అయితే లేడు.

కాబట్టి ఇప్పుడు ఎవరితో సినిమా చేయాలి అనే విషయంలో నాగార్జున తీవ్రమైన చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తుంది.

Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...
Advertisement

తాజా వార్తలు