కరోనా గుప్పిట్లో నలుగుతున్న అగ్ర రాజ్యం ...!

ప్రపంచంలో పెద్దన్నగా చెప్పుకునే దేశం అమెరికా.అన్ని విషయాల్లో మొదటిగా ఉండే అమెరికా చివరికి కరోనా కేసులు కూడా ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది.

రోజుకి ఏకంగా 30 నుండి 40 వేల కేసులు పైగానే ఆ దేశంలో నమోదవుతున్నాయి.ఓవైపు కరోనా, ఓవైపు అధ్యక్ష ఎన్నికలతో అమెరికా సతమతమవుతోంది.

ఇకపోతే తాజాగా కరోనా వైరస్ తన ప్రభావంతో అగ్రరాజ్యాన్ని వణికిస్తోంది.గడచిన 24 గంటల్లో ఏకంగా దేశం మొత్తం మీద 65,551 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఈ సంఖ్యతో అమెరికా దేశంలో కరోనా కేసులు 32 లక్షల 20 వేలకు చేరుకున్నాయి.అలాగే ప్రస్తుతం దేశం మొత్తం మీద 16 లక్షలకు పైగా కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి.

Advertisement

అయితే దాదాపు 45 శాతం వరకు కరోనా నుండి ఇప్పటికే కోలుకున్నారు.ఇది ఒక్కటి వారు సంతోషించాల్సిన విషయం.

అంతేకాదు గడచిన 24 గంటల్లో అమెరికాలో ఏకంగా 960 మంది కరోనా మహమ్మారి కారణంగా మరణించారు.దీంతో దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 135000 కు చేరింది.

కరోనా వైరస్ నేపథ్యంలో అమెరికాలోని ప్రజలు చాలా మంది వారి జీవనాన్ని కోల్పోయారు.దీంతో ఆ దేశంలో నిరుద్యోగం తార స్థాయికి చేరింది.ఇందులో అనేకమంది భారతీయులు కూడా లేకపోలేదు.

జీవితం మహా చెడ్డది భయ్యా.. భార్య వల్ల చెత్త ఏరుకునే స్థాయికి ఇంజనీర్‌..?
Advertisement

తాజా వార్తలు