పుష్ప 2 పై అంబటి కామెంట్స్ .. వారిని అరెస్ట్ చేయకపోవడంపై ఫైర్ 

ఏపీలో టీడీపీ  ప్రభుత్వం( TDP government in AP ) అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసిపి కార్యకర్తలు,  సోషల్ మీడియా యాక్టివిస్తులను టార్గెట్ చేసుకుని అనేక చర్యలకు దిగుతోంది.

దీంతో చాలామంది వైసిపి కీలక నేతలు పూర్తిగా సైలెంట్ అయిపోయారు.

కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్లపోయారు.కానీ జగన్ కు అత్యంత సన్నిహితులైన కొంతమంది మాత్రం టిడిపి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ తమ పార్టీ వాదనను వినిపించే ప్రయత్నం చేస్తున్నారు.

వారిలో ఒకరు మాజీ మంత్రి అంబటి రాంబాబు ( Former minister Ambati Rambabu ).తాజాగా సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంపై అంబటి రాంబాబు స్పందించారు.సోషల్ మీడియా పోస్టులపై వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నప్పుడు,  మరి టిడిపి కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయడం లేదని రాంబాబు ప్రశ్నించారు.

Ambatis Comments On Pushpa 2 Are Under Fire For Not Arresting Them, Ambati Ramb

వైయస్సార్ సీపీకి( YSR CP ) చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను పెద్ద ఎత్తున అరెస్టు చేస్తున్నారు. ఐటీ యాక్ట్ కింద కేసులు( IT Act ) నమోదు చేస్తున్నారు.అసభ్యకరమైన పోస్టింగ్ పెడితే టిడిపి వాళ్ళను కూడా అరెస్టు చేస్తామని చంద్రబాబు నీతి వ్యాఖ్యలు చెప్పారు.

Advertisement
Ambati's Comments On Pushpa 2 Are Under Fire For Not Arresting Them, Ambati Ramb

వైఎస్ఆర్సిపి నేతలపై అసభ్యకరమైన పోస్టింగ్ పెట్టిన వారిపై ఫిర్యాదు చేసిన చర్యలు మాత్రం లేవు.ఇప్పటికే ఈనెల 17, 18, 19 తేదీల్లో వైయస్ జగన్( YS Jagan ) ఆయన కుటుంబ సభ్యులతో పాటు,  మా కుటుంబ సభ్యులపై పెట్టిన పోస్టులపై వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశాం.

నిన్న అన్ని స్టేషన్ లకు వెళ్లి ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించాం స్పష్టమైన సమాధానం మాకు రాలేదు.ఇప్పుడు స్పీకర్ గా ఉన్న వ్యక్తి వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

లోకేష్ కూడా వైఎస్ జగన్ పై అసభ్యకరమైన పోస్టులు పెట్టారు.రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.

పోలీసులు స్పందించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం.స్పీకర్ అయినా , మంత్రి అయినా చట్టం దృష్టిలో ఒకటే .ఇది అంతం కాదు ఆరంభమే .జమిలి ఎన్నికలు వస్తాయన్న ప్రచారం జరుగుతోంది.  రామ్ గోపాల్ వర్మ పైన కేసులు పెట్టారు.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

పోసాని కృష్ణ మురళి వైయస్ జగన్ అభిమాని.ఆయన పైన కేసులు పెట్టి భయ పెట్టొచ్చేమో కానీ , వైఎస్ జగన్ పై ఆయనకున్న ప్రేమను మాత్రం తొలగించలేరు.

Advertisement

రెడ్ బుక్ లోకేష్ రాశాడు.  రెడ్ బుక్ లోకేష్ కు శాపంగా మారుతోంది.

రెడ్ బుక్ రచయితగా లోకేష్ చరిత్రలో నిలిచిపోతాడు అంటూ అంబటి రాంబాబు విమర్శించారు.

పుష్ప సినిమాపై అల్లు అర్జున్ సినిమాలు చూడకుండా ఎవరు ఆపలేరు అల్లు అర్జున్ ( Allu Arjun )ఇంటర్నేషనల్ స్టార్.పుష్ప 2 అడ్డుకోవడం ఎవరివల్లా కాదు గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అడ్డుకోవాలనుకున్నారు ఏమైంది ?  సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు .పుష్ప w  కోసం అందరూ ఆశక్తి గా ఎదురు చూస్తున్నారు.అరచేతిని అడ్డుపెట్టుకుని సినిమా విజయాన్ని ఆపలేరు.

నేను కూడా సినిమా చూడడానికి రెడీగా ఉన్నాను.మొదటి పార్ట్ అద్భుతంగా ఉంది.

కొంతమందికి జలసీగా ఉంది.ఎన్టీఆర్ , అల్లు అర్జున్ లను బహిష్కరించాలనుకోవడం అవివేకం ’ అంటూ అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు.

తాజా వార్తలు