ఇదెలా సాధ్యం బాస్.. కర్చీఫ్ ను అలా ఎలా పాములా మార్చేసావ్?

మనలో చాలామంది పాములు( Snakes ) అంటేనే భయపడే వారు ఉన్నారు.ఇకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది.

ఒకరు చదువులో బాగా రాణించవచ్చు.మరొకరు వ్యాపారంలో బాగా రాణించవచ్చు.

మరొకరు., వారి తెలివితేటలతో చిన్న చిన్న ట్రిక్కులు వాడి మ్యాజిక్ చేసి ప్రజలను మెప్పించవచ్చు.

ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఎన్నో సందర్భాలలో మాయలు, మంత్రాలు అంటూ ఎన్నో షోస్ చేస్తూ ఉంటారు.చిన్న చిన్న ట్రిక్కులతో మ్యాజిక్( Magic ) చేసి సామాన్యలను సైతం వావ్ అనిపించేలా మెజీషియన్స్ పనులు చేస్తుంటారు.

Advertisement

ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో వీడియో తెగ వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో ఓ వ్యక్తి హోటల్లో అందరూ చూస్తున్న సమయంలోనే టేబుల్ పై ఓ అద్భుత ప్రదర్శన చేశాడు.అందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.ఓ వ్యక్తి తన దగ్గర ఉన్న కర్చీఫ్ ను( Kerchief ) బయటకు తీసి దానిని ఓ ఆకారంలో ఉండేలా మొదటగా టేబుల్ పై పెట్టడం మనం గమనించవచ్చు.

ఈ మ్యాజిక్ చేస్తున్న సమయంలో అతడికి పక్కనే ఓ మహిళ కూడా ఉండడం మనం వీడియోలో గమనించవచ్చు.ఇలా ఆవిడ అతడు చేస్తున్న పనిని చూస్తూ చూస్తూ ఉండగానే.

ఒక్కసారిగా ఆ కర్చీఫ్ కాస్త అచ్చం కర్చీఫ్ కలర్ లో ఉన్న పాము లాగానే మార్చేశాడు.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности
పైసా ఖర్చు లేకుండా ముఖంపై మచ్చలను పోగొట్టుకోవాలనుకుంటే ఇలా చేయండి!

దీంతో ఆ మహిళ భయంతో ఒక్కసారిగా తాను కూర్చున్న దగ్గర నుంచి అరుస్తూ పైకి లేచి దూరంగా వెళ్లిపోయింది.దాంతో అక్కడ ఉన్న ప్రజలందరూ అతడు చేస్తున్న పనిని చూస్తూ ఆశ్చర్యంలో మునిగిపోయారు.ఇక ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా నేటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

Advertisement

ఓరి దేవుడా ఏంటి బాసు కర్చీఫ్ ను అంత సులువుగా పాముగా ఎలా మార్చేసావు అని కొందరు కామెంట్ చేస్తుండగా.ఇతనితో చాలా డేంజర్ గురు.అతని కోపం వచ్చిందంటే మీ ఇంట్లో చాలా సులువుగా పామును వదిలేస్తాడంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

మరికొందరు అతని టాలెంట్ ను మెచ్చుకుంటున్నారు.

తాజా వార్తలు