ఎసిడిటిని తగ్గించే సమర్ధవంతమైన మరియు సింపుల్ ఇంటి చిట్కాలు

ఎసిడిటి అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఒకటి.ఈ సమస్య వేసవిలో ఎక్కువగా ఉంటుంది.

వేసవిలో వచ్చే ఎసిడిటికి కడుపు ఉబ్బరం,త్రేన్పులు,వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి.ఈ వేసవిలో వచ్చే ఎసిడిటికి మందుల కన్నా ఇంటి చిట్కాలు చాల సమర్ధవంతంగా పనిచేస్తాయి.

తులసి ఆకులు

వేసవిలో వచ్చే ఎసిడిటికు తులసి మంచి పరిష్కారం.తులసిలో ఉండే కార్మినేటివ్ , స్మూతింగ్ లక్షణాలు ఎసిడిటిని తగ్గించటంలో సహాయపడతాయి.

తులసి ఆకులను నమలవచ్చు.లేదా నీటిలో నాలుగు తులసి ఆకులను వేసి మరిగించి ఆ నీటిని కూడా త్రాగవచ్చు.

Advertisement

మజ్జిగ

మజ్జిగలో అనేక ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి.మజ్జిగ పొట్టలో ఎసిడిటిని తగ్గించటంతో పాటు కడుపులో మంటను కూడా తగ్గిస్తుంది.

మజ్జిగలో చిటికెడు ఉప్పు వేసుకొని త్రాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.

బాదాం

బాదంలో క్యాల్షియం మరియు ఆల్కలైన్ కాంపౌండ్స్ సమృద్ధిగా ఉండుట వలన కడుపులో ఆమ్ల స్థాయిలను స్థిరీకరిస్తుంది.ప్రతి రోజు భోజనం అయ్యాక రెండు బాదాంలను తింటే ఆమ్లాల స్థాయిలు బేలన్స్ అయ్యి ఎసిడిటి తగ్గుతుంది.

వెల్లుల్లి

ముఖ్యంగా వేసవిలో వచ్చే ఎసిడిటిని తగ్గించటంలో వెల్లుల్లి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

ఒక వెల్లుల్లి రెబ్బను నమలటం లేదా వేడి అన్నంలో పెట్టుకొని తిన్నా మంచి ఫలితం కనపడుతుంది.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
మెడ న‌లుపుతో వ‌ర్రీ వ‌ద్దు.. ఇవి ట్రై చేయండి..!

కొబ్బరి నీరు

వేసవిలో కొబ్బరి నీటికి చాలా డిమాండ్ ఉంటుంది.కొబ్బరి నీరు శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచటానికి మరియు పొట్టలో ఆమ్లాలను కూడా బేలన్స్ చేస్తుంది.కొబ్బరి నీరు కడుపులో ఉన్న అనవసర ఆమ్లాలను బయటకు పంపి వేడిని తగ్గించటంలో సహాయపడుతుంది.

Advertisement

అలోవెరా (కలబంద)

కలబందలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.అవి మనకు చాల బాగా సహాయపడతాయి.పొట్టలో ఎసిడిటిని తగ్గించటంలో బాగా సహాయపడుతుంది.

అయితే కలబంద జ్యుస్ ను తాజాగా తీసుకోవాలి.

బేకింగ్ సోడా

ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలిపి తీసుకుంటే వెంటనే కడుపులో అసిడిటీ మరియు కడుపులో మంట తగ్గిపోతాయి.

అల్లం

అల్లం ఎసిడిటిని తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.అల్లంను చిన్న ముక్కలుగా చేసి నీటిలో వేసి మరిగించి వడగట్టాలి.

ఆ నీటిలో నిమ్మరసం కలిపి త్రాగాలి.

తాజా వార్తలు