అమరావతిలో తాత్కాలిక హైకోర్ట్ భవనంలో ప్రమాదం!

ఏపీ రాజధాని అమరావతిని చాలా వేగవంతంగా నిర్మిస్తున్న అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకుంటున్నారు.

అయితే ప్రభుత్వ భవనాల నిర్మాణం ఎంత నాసిరకంగా వున్నాయో చెప్పడానికి గతంలో అసెంబ్లీ భవనంలో పగుళ్ళు, వర్షాకాలంలో నీళ్ళు లోపలి రావడం వంటి ఘటనలు చూపించాయి.

మరో సారి అలాంటి ఘటన అమరావతిలో తాత్కాలిక హై కోర్ట్ భవనం నిర్మాణంలో జరిగింది.తాత్కాలిక హై కోర్ట్ భవనం నిర్మాణం చాలా వేగవంతంగా అమరావతిలో చేస్తున్నారు.

అయితే ఊహించని విధంగా నిర్మాణం జరుగుతున్నా సందర్భంలో ఓ రెండు గదులు కూలిపోయినట్లు తెలుస్తుంది.ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులకి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది.

అయితే ఈ విషయాన్ని అధికారులు ద్రువీకరించడానికి ఇష్టపడటం లేదని సమాచారం.అయితే భవనాలు నాసిరకం కారణంగానే అమరావతిలో తరుచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అని తెలుస్తుంది.

Advertisement
చిప్స్ ఇష్టంగా తింటున్నారా..అయితే ఇది చదివితీరాల్సిందే....

తాజా వార్తలు