హీరోయిన్లను మించిన అందంతో స్నేహారెడ్డి.. వైరల్ అవుతున్న క్యూట్ ఫోటోస్!

సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు అల్లు అర్జున్( Allu Arjun ) ఒకరు.

స్టైలిష్ స్టార్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకుని దూసుకుపోతూ ఉన్నటువంటి అల్లు అర్జున్ పుష్ప( Pushpa ) సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోగా సక్సెస్ అందుకొని ఐకాన్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలను సంపాదించారు.

స్థాయిలో ఎంతో మంచి క్రేజీ సొంతం చేసుకున్నటువంటి ఈయన కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈయన వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా గడుపుతున్నారు.

ఇక అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి( Sneha Reddy ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ హీరోయిన్లను మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే అల్లు స్నేహ తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

Advertisement

ఇలా తన పిల్లల విషయాలను అలాగే తన భర్తకు సంబంధించిన అన్ని విషయాలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉండటంతో ఈమె సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా అధికమైంది.ఇక స్నేహ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి ఏ మాత్రం సంబంధంలేని అమ్మాయి అయినప్పటికీ హీరోయిన్లను మించి ట్రెండ్ ఫాలో అవుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు.

తరచూ ఫోటో షూట్ లో నిర్వహిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఈ క్రమంలోని తాజాగా స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.బ్లాక్ కలర్ డిజైనర్ వేర్( Black Color Design Wear ) ధరించి చాలా క్యూట్ గా అందంగా ఉన్నటువంటి ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారడంతో అల్లు అర్జున్ అభిమానులు( Allu Arjun Fans ) వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు.

అల్లు స్నేహ ఫోటోలపై కొందరు నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఇదేమీ ఒరిజినల్ అందం కాదు పూర్తిగా ఫిల్టర్ యూస్ చేసావు స్పష్టంగా కనబడుతోంది అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మా వదినమ్మ సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇలా అల్లు అర్జున్ అభిమానులు స్నేహ రెడ్డి ఫోటోలపై కామెంట్స్ చేస్తూ ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు