Ram Charan : రామ్ చరణ్ అసలు రంగు బయటపెట్టిన అల్లు శిరీష్.. బుద్ధిమంతుడేం కాదంటూ?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఒక క్రేజ్ ఉంది.

చిరంజీవి ( Chiranjeevi ) ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకొని ఈ కుటుంబం నుంచి ఎంతోమందికి లైఫ్ ఇచ్చారనే సంగతి మనకు తెలిసిందే.

ఇలా మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్నారు.ఇక చిరంజీవి వారసుడుగా రామ్ చరణ్ ( Ram Charan ) కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

తండ్రికి మించిన తనయుడుగా సినిమా ఇండస్ట్రీలోనూ మంచి తనంలోనూ చరణ్ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.

ఇక చరణ్ ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలాగే వ్యవహరిస్తూ ఉంటారు.ఒక బాధ్యత గల వ్యక్తిగా చరణ్ గుర్తింపు పొందార.  ఇటీవల ఉపాసన కాళ్ళను నొక్కుతూ ఈయనకు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారడంతో ఎంతో మంది అమ్మాయిలు రామ్ చరణ్ కు అభిమానులుగా మారిపోయారు.

Advertisement

ఇదిలా ఉండగా గతంలో రామ్ చరణ్ గురించి అల్లు శిరీష్( Allu Sirish ) చేసినటువంటి ఓల్డ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఓ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అల్లు శిరీష్ మీ ఇంట్లో ఎవరు బాగా అల్లరి చేస్తారని అడగగా ఈయన మాట్లాడుతూ అందరూ చరణ్ నీ చూడగానే బుద్ధిమంతుడు అనుకుంటారు .కానీ అంత బుద్ధిమంతుడు ఏమి కాదని అందరిలో కల్లా బాగా అల్లరి చేసేది చరణ్ అంటూ శిరీష్ తెలిపారు.సైలెంట్ గా తను చేసే పనులు చేస్తుంటారు కానీ నన్ను హైలెట్ చేస్తుంటారు.

ఇక బుద్ధిమంతుడు ఎవరు అంటే సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) అని తెలిపారు.మేమేదైనా కలిసి ఒక పని చేస్తే ఎక్కడ దొరికిపోతామో అని భయపడుతూ ముందుగా వాడే అని చెప్పేస్తాడని అందుకే తనని మా బ్యాచ్ చేర్చుకోవాలంటే భయపడుతుంటామంటూ శిరీష్ ఈ సందర్భంగా తమ అల్లరి పనుల గురించి చెబుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు