రామ్ చరణ్ కి తెలివి లేదని అన్నాడా బన్ని?

మెగా హీరోల సినిమాల్లో చిరంజీవి రిఫరెన్సులు ఉన్న సినిమాల కంటే, లేని సినిమాలు లెక్కపెట్టడమే సులువు.

పవన్ కళ్యాణ్ నుంచి సాయిధరమ్ తేజ్ వరకు, అందరు మెగాస్టార్ రిఫరెన్సులు తమ సినిమాల్లో పెట్టుకున్నవారే.

ఇక రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్ అయితే ఏకంగా చిరంజీవి పాత పాటల్ని రీమేక్ చేసారు.చిరంజీవి రీమేక్ పాట ఉంటే చరణ్ సినిమా హిట్టు అన్నట్లు ఉండేది ఓ సమయంలో.

మరి మగధీర, రచ్చ్, నాయక్ లాంటి సినిమాలు చిరంజీవి పాత పాటలతో హిట్ అయ్యాయి కూడా.ఇక మెగా అల్లుడు సాయిధరమ్ కూడా అడపాదడపా చిరంజీవి పాత పాటల్ని తన సినిమాల్లో పెట్టుకుంటున్నాడు.

కాని మరో మెగా అల్లుడు అల్లు అర్జున్ మాత్రం తానెప్పటికి చిరంజీవిని అలా వాడుకోనని అంటున్నాడు.బన్ని ఇప్పటివరకు చింరజీవి పాటల్ని రీమేక్ చేయలేదు.

Advertisement

రిఫరెన్సులు వేరే విషయం కాని పాటల జోలికి మాత్రం పోలేదు.అదే పద్ధతిలో చిరంజీవి పాటల్ని ఎప్పటికి రీమేక్ చేయనని అంటున్నాడు.

అలా ఎందుకు అంటే చిరంజీవి పాటల్ని రీమేక్ చేయడం తెలివైన నిర్ణయం కాదట.చిరంజీవి పాటల జోలికి ఎందుకు వెళ్ళడం, అది తెలివైన పని కాదు, అదీకాక ఒరిజినల్ గా ఉండటమే తనకు ఇష్టం అంటూ ఈమధ్య డీజేని ప్రమోట్ చేస్తూ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు బన్ని.

ఇప్పుడు ఈ కామెంట్స్ చరణ్ - బన్ని ఫ్యాన్స్ మధ్య గొడవలు సృష్టించేలా ఉన్నాయి.ఇష్టం ఉంటే రీమేక్ చేయాలి లేదంటే కామ్ గా ఉండాలి కాని రీమేక్ చేయడం తెలివైన పని కాదు అంటూ ఎందుకు కామెంట్ చేయడం అంటూ ప్రశ్నిస్తున్నారు చరణ్ ఫ్యాన్స్.

ఇప్పడికే పవన్ కళ్యాణ్ అభిమానులతో అల్లు ఫ్యామిలికి పీకల్లోతు పగలు ఉన్నాయి.బన్ని చరణ్ ఫ్యాన్స్ తో తగాదాలు కొనుక్కుంటున్నాడా? .

ఈ ఆహారపదార్థాలు భోజనం తరువాత తీసుకుంటే నిద్ర త్వరగా పడుతుంది
Advertisement

తాజా వార్తలు