Allu Arjun Trivikram : ఇక నుండి అన్ని సొంతగానే అంటున్న అల్లు అర్జున్

అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ విషయం లో గత కొన్ని రోజులుగా ఆసక్తికర చర్చ జరుగుతుంది.

పుష్ప 2 సినిమా కు గాను ఈయన తీసుకుంటున్న పారితోషికం కాస్త ఎక్కువ అంటూ వార్తలు వస్తున్నాయి.

మరి కొందరు మాత్రం ఏకంగా 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ని అల్లు అర్జున్ ఈ సినిమా కోసం తీసుకోబోతున్నాడు అనేది ప్రచారం చేస్తున్నారు.మొత్తానికి అల్లు అర్జున్ కి వచ్చిన స్టార్డం నేపథ్యం లో భారీ ఎత్తున రెమ్యూనరేషన్ అయితే తీసుకుంటున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత బన్నీ అన్ని సినిమాలు కూడా సొంత బ్యానర్ లోనే నిర్మాణం జరగబోతున్నాయట.ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వం లో సినిమా ను చేసేందుకు బన్నీ ఓకే చెప్పాడు.

త్రివిక్రమ్ హోం బేనర్ హారిక అండ్ హాసిని తో కలిసి అల్లు అర్జున్ తన గీత ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా రూపొందబోతుంది అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Advertisement

దర్శకుడికి హోం బ్యానర్ ఉంటే ఆ బ్యానర్ తో కలిసి అల్లు అర్జున్ తన గీత ఆర్ట్స్ బ్యానర్ తో కలిసి సినిమా ను నిర్మించబోతున్నాడు.తన పారితోషకం ని పెట్టుబడిగా పెట్టడం ద్వారా ఇక నుండి భారీ ఎత్తున లాభాలు సొంతం చేసుకోవాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడు అంటూ ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం అందుతుంది.గతం లో ఇలా చాలా మందికి హీరో లు చేశారు.

కానీ అందులో కొంత మంది చేతులు కాల్చుకున్నారు.ఇప్పుడు అల్లు అర్జున్ తన పై తనకు ఉన్న నమ్మకాన్ని ఇలా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ ఆయన అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ విషయం లో చూసి చూడనట్లుగా వ్యవహరిస్తేనే మంచి సినిమాలు వస్తాయి.కనుక సొంత బ్యానర్ లోనే అన్ని సినిమాలు చేస్తా అని పట్టు పట్టడం కరెక్ట్ కాదు అంటూ కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరి అల్లు అర్జున్ నిర్ణయమేంటి అనేది తెలియాలంటే తన తదుపరి సినిమా కు సంబంధించిన అప్డేట్ రావాల్సి ఉంది.

ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?
Advertisement

తాజా వార్తలు