డ్యామేజ్ కంట్రోల్ లో బన్నీ టీం..!

అల్లు అర్జున్( Allu Arjun ) తో వరుడు సినిమాలో నటించిన భాను శ్రీ మెహ్రా ( Bhanu Shri Mehra )ఆ సినిమా ఫ్లాప్ అవడంతో కేవలం ఒకటి రెండు సినిమాలకే అంకితమైంది.

ఛాన్స్ లు రాకపోయే సరికి సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని తన వీడియోస్ పెడుతూ అలరిస్తుంది అమ్మడు.

అయితే అల్లు అర్జున్ ట్విట్టర్ ఖాతాని ఫాలో అవుతున్న భాను శ్రీని సడెన్ గా అల్లు అర్జున్ ఆమె ఎకౌంట్ ని బ్లాక్ చేయడం జరిగంది.దీనిపై ఆమె సోషల్ మీడియాలో హడావిడి చేసింది.

అల్లు అర్జున్ నా ఎకౌంట్ ని బ్లాక్ చేశాడని వాపోయింది.అయితే తనతో నటించిన హీరోయిన్ ఎకౌంట్ బ్లాక్ చేయడం పట్ల నెట్జన్లు కూడా అల్లు అర్జున్ మీద సీరియస్ అయ్యారు.

Allu Arjun Team Damage Controle Bhanu Sri Issue , Bhanu Shri Mehra, Allu Arjun ,

ఫైనల్ గా త్వరగానే జాగ్రత్త పడిన అల్లు అర్జున్ టీం ఆమె ఎకౌంట్ ని అన్ బ్లాక్ చేశారు.స్టార్ హీరోల ట్విట్టర్ ఎకౌంట్ ప్రతిసారి వారు చూడటం జరగదు.కొన్నిసార్లు వాళ్ల మనషులు దాన్ని హ్యాండిల్ చేస్తుంటారు.

Advertisement
Allu Arjun Team Damage Controle Bhanu Sri Issue , Bhanu Shri Mehra, Allu Arjun ,

భాను శ్రీ ఖాతా బ్లాక్ చేయడం కూడా అలాంటి పొరపాటే అని అంటున్నారు.ఏది ఏమైనా అల్లు అర్జున్ తన ట్విట్టర్ ఎకౌంట్ అన్ బ్లాక్ చేసినందుకు ఆమె హ్యాపీగా ఉంది.

తన బాధ చెప్పుకునేందుకే కానీ బన్నీని ఇబ్బంది పెట్టే ఉద్దెశం లేదని ఆమె ట్విట్టర్ లో చెప్పుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు