పుష్ప : ది రూల్ రివ్యూ.. బన్నీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరినట్టే!

బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య, ఆర్య2, పుష్ప ది రైజ్ తెరకెక్కగా ఈ సినిమాలలో ఆర్య2 మినహా మిగతా రెండు సినిమాలు హిట్ గా నిలిచాయి.

పుష్ప ది రైజ్ కు సీక్వెల్ గా దాదాపుగా 475 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పుష్ప ది రూల్( Pushpa The Rule ) నేడు థియేటర్లలో విడుదలైంది.

ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి నెటిజన్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.పుష్ప ది రూల్ తో బన్నీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది.

Allu Arjun Sukumar Rashmika Pushpa The Rule Movie Review And Rating Details, All

కథ :

ఎర్ర చందనం కూలీ నుంచి సిండికేట్ కు నాయకుడిగా ఎదిగిన పుష్పరాజ్(బన్నీ)( Allu Arjun ) రాష్ట్రంలోని అధికార పార్టీకి ఫండ్ ఇస్తూ ఉంటాడు.పుష్పరాజ్ భార్య శ్రీవల్లి(రష్మిక)( Rashmika ) సీఎంతో తన భర్త ఫోటో దిగాలని కోరగా ఫోటో విషయంలో సీఎం నిరాకరించడంతో పుష్పరాజ్( Pushparaj ) అహం దెబ్బతింటుంది.శ్రీవల్లి పుట్టినరోజునే సిద్ధప్ప( రావు రమేష్) ను సీఎం చేయడానికి పుష్పరాజ్ ఏం చేశాడు? పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో వేసిన ప్లాన్స్ ను భన్వర్ సింగ్ షెకావత్ (ఫహద్ ఫాజిల్) భగ్నం చేశాడా? పుష్పరాజ్ కు షెకావత్ కు సారీ చెప్పి ఇచ్చిన ట్విస్ట్ ఏంటి? ఇంటి పేరు లేని పుష్పరాజ్ కు ఇంటి పేరు ఎలా దక్కింది అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

Allu Arjun Sukumar Rashmika Pushpa The Rule Movie Review And Rating Details, All

విశ్లేషణ :

పుష్ప ది రూల్ సినిమాలో చెప్పుకోవడానికి గొప్ప కథేం లేదు.అయితే ప్రేక్షకులు కోరుకునే ఎలివేషన్ సీన్లు, హీరో తెలివితేటలతో విలన్ కు చుక్కలు చూపించే సీన్లు, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాలు హైలెట్ అయ్యాయి.కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం పుష్ప ది రూల్ నచ్చుతుందని చెప్పవచ్చు.పాటలు, బీజీఎం సినిమాకు హైలెట్ గా నిలిచాయి.3 గంటల 20 నిమిషాల నిడివితో సినిమా విడుదలైనా ఎక్కడా బోర్ కొట్టదు.

Allu Arjun Sukumar Rashmika Pushpa The Rule Movie Review And Rating Details, All
Advertisement

ఎడిటింగ్ షార్ప్ గా ఉండగా సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది.దర్శకుడు సుకుమార్( Director Sukumar ) మరోసారి దర్శకత్వ ప్రతిభను చాటుకున్నారు.కామెడీ ప్రధానంగా లేకపోయినా కొన్ని రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను కవ్విస్తాయి.

పుష్ప ది రూల్ లో సుకుమార్ ఎమోషనల్ సన్నివేశాలకు పెద్దపీట వేశారు.ఫస్టాఫ్ నిడివి ఎక్కువగా ఉండగా ఫస్టాఫ్ ను ఒక విధంగా సెకండాఫ్ ను మరో విధంగా సుకుమార్ నడిపించారు.

సెకండాఫ్ లో కొన్ని సీన్లు రొటీన్ గా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

నటీనటుల పనితీరు :

పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటించారు అని చెప్పడానికి బదులుగా జీవించారని చెప్పవచ్చు.ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు బన్నీ తన నటనతో ప్రాణం పోశారు.రష్మిక కొన్ని సీన్స్ లో పర్ఫామెన్స్ తో డామినేట్ చేసింది.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

కిస్సిక్ సాంగ్ లో శ్రీలీల( Sreeleela ) శృతి మించి అందాలు ఆరబోసింది.అయితే ఈ పాట ప్లేస్ మెంట్ మాత్రం బాలేదని చెప్పవచ్చు.

Advertisement

మంగళం శ్రీను, అతని భార్య పాత్రలకు తగిన ప్రాధాన్యత దక్కలేదు.షెకావత్ పవర్ ఫుల్ విలన్ గా కొన్ని సీన్స్ లో కనిపించినా మరికొన్ని సీన్స్ లో తేలిపోయాడు.

బ్రహ్మాజీ మాత్రం తన పాత్రకు న్యాయం చేశాడు.

రేటింగ్ : 3.25/5.0

బాటమ్ లైన్ :

బన్నీ అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి సినిమా .

తాజా వార్తలు