బురదలో దూకాకే ఈత నేర్చుకోవాలన్న బన్నీ.. నా బలం, బలగం అంతా వాళ్లేనంటూ?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్( Allu Arjun ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్( Sukumar ) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే దర్శకుడు అజయ్ భూపతి, పాయల్ రాజ్ పుత్ కాంబోలో వస్తున్న మిస్ట్రీరియస్ డార్క్ థ్రిల్లర్ మూవీ మంగళవారం( Thriller Movie mangalavaram ).ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది.ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు మూవీ మేకర్స్.

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.అందరికీ హ్యాపీ దీవాళీ.నా బలం.నా బలగం అంతా నా ఫ్యాన్స్.ఈ మాట నేను ఎన్నోసార్లు చెప్పాను.

Advertisement

చాలామంది ఫ్యాన్స్‌కి వాళ్ల హీరో ఇన్స్పిరేషన్ కానీ నాకు నా ఫ్యాన్సే ఇన్స్పిరేషన్.నా మీద నాకు నమ్మకం లేనప్పుడు నమ్మకం కలిగేలా చేసింది నా ఫ్యాన్స్.

మిమ్మల్ని చూశాక నాపై నాకు నమ్మకం కలిగింది.నా నమ్మకాన్ని నిలబెట్టినందుకు మీకెప్పుడూ రుణపడి ఉంటాను.

మంగళవారం మూవీ శుక్రవారం రిలీజ్ అవుతుంది.ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.

టీజర్ చూసి నేను షాకయ్యాను.టీజర్ చూసిన వెంటనే సినిమా చూడాలనిపించే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!

నాకు ఈ సినిమా టీజర్ చూడగానే సినిమా చూడాలని అనిపించింది.

Advertisement

అజయ్ గారు నాకు కథ చెప్పినప్పుడు.ఆయన నాతో చెప్పిన మాట నాకు ఇంకా గుర్తుంది.సర్ మీరు గర్వించే స్థాయిలో సినిమా తీస్తానని అన్నారు.

అన్నట్టుగానే ట్రైలర్‌లో ఆ ఫీలింగ్ అయితే కలిగించారు.నాకు ఆయన డైరెక్షన్‌లో వచ్చిన RX100 సినిమా( RX100 movie ) అంటే చాలా ఇష్టం.

ఆయన గొప్ప టెక్నీషియన్.గొప్ప డైరెక్టర్ అనే నమ్మకం ఉంది అని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్.

అనంతరం పుష్ప 2 సినిమా గురించి మాట్లాడుతూ.నేను ఇప్పుడు షూటింగ్ నుంచే వచ్చాను.

నా చేతులకు పారాణీ.గోళ్ల రంగూ చూస్తున్నారుగా, పోస్టర్‌లో ఉన్న జాతర ఎపిసోడ్ రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేస్తున్నాము.

దాని గురించి వేరే ఈవెంట్‌లో మాట్లాడుకోవచ్చు.నాకు నేషనల్ అవార్డ్ వచ్చిన తరువాత నా ఫస్ట్ సినిమా ఈవెంట్ ఇది అని చెప్పు కొచ్చారు బన్నీ.

తాజా వార్తలు