వారికి కృతజ్ఞతలు తెలిపిన అల్లు అర్జున్... ఎందుకో తెలుసా...?

టాలీవుడ్ లో అల్లు ఫ్యామిలీ కి ఉన్న ఫేమ్ మరియు గుర్తింపు గురించి కొత్తగా చెప్పనవసరం లేదు.

 ఒకప్పుడు ప్రముఖ కమెడియన్ గా అల్లూరి రామలింగయ్య సినీ ప్రస్థానానికి బీజం వేస్తే తర్వాత ఆయన కొడుకు అల్లు అరవింద్ నిర్మాతగా మారి టాలీవుడ్ లో పలు చిత్రాలకి నిర్మాతగా వ్యవహరించి మంచి మన్ననలు పొందారు.

అయితే ఇప్పటి తరంలో అల్లు అరవింద్ రెండవ కొడుకు అల్లు అర్జున్ టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన కొనసాగుతున్నాడు.అయితే సినిమాల పరంగా గానే కాకుండా అల్లు ఫ్యామిలీ మంచి, మర్యాదలకి కూడా పెట్టింది పేరు.

అయితే తాజాగా అల్లు అర్జున్ తన కొడుకు అల్లు అయాన్ కి చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులకి కృతజ్ఞతలు తెలిపాడు.అంతేగాక అల్లు అయాన్ తో పాటు ఎంతోమంది విద్యార్థులను మంచి బాటలో నడిపించేందుకు వారు చేసినటువంటి కృషి ఎనలేనిదంటూ పొగడ్తలతో ముంచెత్తారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే అల్లు అయాన్ తన ప్రీ స్కూల్ నీ పూర్తి చేసుకున్నాడు.అంతేగాక అయాన్ బోధి స్కూల్లో చదువుతున్న అందుకు తమకు ఎంతో సంతోషంగా ఉందని అన్నాడు.

Allu Arjun Say Thanks To The Allu Ayaan School Teachers
Advertisement
Allu Arjun Say Thanks To The Allu Ayaan School Teachers-వారికి క�

అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో అల్లు అర్జున్ మాస్ యాంగిల్ లో కనిపించనున్నాడు.అంతేగాక ఇప్పటికే ఈ చిత్రం కేరళ రాష్ట్రంలో చిత్రీకరణ జరుపుకుంటోంది.

తొందర్లోనే ఈ చిత్ర వివరాలను దర్శకుడు సుకుమార్ వెల్లడించనున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు