'ఊ అంటావా' సాంగ్ తో వచ్చిన సమస్య పుష్ప 2 మాత్రమే తీర్చబోతుందా?

ఐటెం సాంగ్. ఈ పేరు చెబితేనే చాలా మందికి పూనకాలు వచ్చేస్తాయి.

అంతలా ఐటెం సాంగ్ లకు ఆదరణ ఉంది.ముఖ్యంగా యువత ఈ ఐటెం సాంగ్ లను బాగా ఆదరిస్తారు అనే చెప్పాలి.

ఇప్పటికే మన టాలీవుడ్ ను ఊపేసిన ఐటెం సాంగ్స్ చాలానే ఉన్నాయి.ఇక ఇటీవల కాలంలో ప్రేక్షకులకు బాగా నచ్చిన ఐటెం సాంగ్ అంటే పుష్ప సినిమాలోని ఊ అంటావా మావా అనే చెప్పాలి.

సమంత చేసిన ఈ ఐటెం సాంగ్ ఏ రేంజ్ లో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అనే చెప్పాలి.

Advertisement

సుకుమార్ డైరెక్టర్ కు అల్లు అర్జున్ యాక్షన్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ మెస్మరైజ్ అయ్యారు.ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది కావొస్తున్నా ఇంకా పుష్ప పాటలు, డైలాగ్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టు కుంటున్నాయి.

ఉత్తరాదిన కూడా సంచలన విజయం సాధించిన ఈ సినిమాతో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.ఇక ఇప్పుడు ఫ్యాన్స్ అంతా పుష్ప 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా మొదటి పార్ట్ లో ఐటెం సాంగ్ ఈ సినిమాకే ప్లస్ అయ్యింది.సౌత్ టాప్ హీరోయిన్ సమంత ఊ అంటావా మామ.ఊఊ అంటావా మావా.అనే సాంగ్ తో ఊపేయడంతో ఇక ఏ ఐటెం సాంగ్ వచ్చిన ప్రేక్షకులకు నచ్చడం లేదు.

పుష్ప తర్వాత ఎన్ని ఐటెం సాంగ్స్ వచ్చిన ఊ అంటావా రేంజ్ లో ఉండడం లేదు అని ప్రేక్షకులు రిజక్ట్ చేస్తున్నారు.దీంతో ఐటెం సాంగ్ లకు కష్టాలు వస్తున్నాయి.ఈ సాంగ్ ను దృష్టిలో పెట్టుకునే మరే సాంగ్ ను ప్రేక్షకులు నోటెడ్ కూడా చేసుకోవడం లేదు.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

అందుకే ప్రతీ ఐటెం సాంగ్ కు ఈ సాంగ్ పెద్ద తలనొప్పిగా మారిపోయింది.గతంలో కూడా ఈ రేంజ్ లో ప్రభావం చూపించిన సందర్భాలు ఉన్నాయి.మరి వీటి ప్రభావం కొన్నేళ్ల వరకు అలాగే కొనసాగుతుంది.

Advertisement

మరి పుష్ప 2 ఐటెం సాంగ్ వస్తే తప్ప ఈ సాంగ్ ప్రభావం తగ్గేలా లేదు.చూడాలి మరీ మరోసారి దేవి శ్రీ మ్యాజిక్ చేస్తాడో లేదో.

తాజా వార్తలు