టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలలో పుష్ప ది రూల్( Pushpa The Rule ) ఒకటి.
పాన్ ఇండియన్ దగ్గర భారీ హైప్ ఉన్న బిగ్గెస్ట్ సినిమాల్లో పుష్ప టాప్ లో ఉంది అని చెప్పాలి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ ( Sukumar ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప.ఈ సినిమా పార్ట్ 1 ఘన విజయం సాధించడంతో పార్ట్ 2పై అన్ని అంచనాలు పెరిగాయి.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా పార్ట్ 1 సౌత్ మాత్రమే కాదు నార్త్ వాళ్ళను కూడా ఆకట్టుకుంది.అందుకే ఈసారి పార్ట్ 1 ను మించి తెరకెక్కిస్తున్నారు.
ఈసారి సౌత్ మాత్రమే కాదు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమా షూట్ సగానికి పైగానే పూర్తి అయ్యింది.
స్టార్ట్ చేయడం లేట్ అయినప్పటికీ శరవేగంగా పూర్తి చేస్తున్నారు.
మరి అంత షూట్ పూర్తి చేసిన రిలీజ్ డేట్ పై( Pushpa 2 Release Date ) ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.ఎట్టకేలకు ఇన్నాళ్లకు రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది.స్వయంగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా పుష్ప ది రూల్ రిలీజ్ డేట్ ప్రకటించారు.
ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.దీంతో ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ కాగా అదిరిపోయే లెవల్లో రెస్పాన్స్ తెచ్చుకుంది.కాగా ఇందులో హీరోయిన్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy