అల్లు అర్జున్ "పుష్ప 2" కొత్త విడుదల తేదీ ప్రకటన..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) కొత్త సినిమా "పుష్ప 2"( Pushpa 2 ) రిలీజ్ విషయంలో చాలామందికి సందేహాలు ఉన్న సంగతి తెలిసిందే.

మొదట ఆగస్టు 15వ తారీకు విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

కానీ షూటింగ్ ఆలస్యం అవుతూ ఉన్న నేపథ్యంలో.డిసెంబర్ ఆరవ తారీకు "పుష్ప 2" విడుదల( Pushpa 2 Release Date ) చేయబోతున్నట్లు అధికారికంగా సినిమా యూనిట్ ప్రకటించడం జరిగింది.

ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.

Allu Arjun Pushpa Second Part New Release Date Announcement Details, Allu Arjun

ఇప్పుడు ఆ ఎదురుచూపులే తమపై బాధ్యతను మరింతగా పెంచాయని సినిమా యూనిట్ చెప్పుకొచ్చింది.ముందు ప్రకటించినట్లుగా సినిమా పూర్తి చేయడానికి నిరంతరం పనిచేస్తున్న.పోస్ట్ ప్రొడక్షన్ పనులకి సమయం పడుతూ ఉండటంతో ఆగస్టు 15కి రిలీజ్ చేయలేకపోతున్నట్లు సినిమా యూనిట్ ప్రకటనలో తేలిపోయింది.

Advertisement
Allu Arjun Pushpa Second Part New Release Date Announcement Details, Allu Arjun

ఈ క్రమంలో క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా అందరి నిర్ణయాలు తీసుకొని డిసెంబర్ 6వ తారీఖున విడుదల చేయడానికి సిద్ధపడినట్లు స్పష్టం చేయడం జరిగింది.

Allu Arjun Pushpa Second Part New Release Date Announcement Details, Allu Arjun

2021లో డిసెంబర్ నెలలో వచ్చిన "పుష్ప"( Pushpa ) అల్లు అర్జున్ పాపులారిటీ అమాంతం పెంచేసింది.ఈ సినిమాతో కూడా టాలీవుడ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమొగింది.ఈ సినిమాకి గాను అల్లు అర్జున్ ఉత్తమ జాతీయ నటుడు అవార్డు కూడా సొంతం చేసుకోవడం జరిగింది.

"పుష్ప" మొదటి భాగం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది.దీంతో "పుష్ప 2" మూవీపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.

బొంబాయి సినిమా లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆ బాలనటులు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు