అల్లు అర్జున్ 'పుష్ప' నుండి బయట పడ్డట్లేనా?

అల్లు అర్జున్‌ గత మూడు సంవత్సరాలుగా గుబురు గడ్డం మరియు పొడవాటి జుట్టు తో మాత్రమే కనిపిస్తూ వచ్చాడు.

పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్‌ జుట్టు మరియు గడ్డం పెంచిన విషయం తెల్సిందే.

పుష్ప 1 ( pushpa movie )విడుదల అయిన తర్వాత కూడా పుష్ప 2( pushpa2 ) కోసం అన్నట్లుగా గడ్డం మరియు జుట్టు కంటిన్యూ చేయడం జరిగింది.మధ్య లో అల్లు అర్జున్( Allu arjun ) కొన్ని కమర్షియల్ యాడ్స్ లో నటించాడు.

ఆ యాడ్స్ లో కూడా పుష్ప లుక్ లోనే కనిపించిన విషయం తెల్సిందే.ఇప్పుడు పుష్ప 2 లో అల్లు అర్జున్ నటిస్తున్నాడు.వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు షూటింగ్ ఉంటుందని అంటున్నారు.

అయితే ఇప్పుడు అల్లు అర్జున్‌ మునుపటి పుష్ప గెటప్ లో లేక పోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఇప్పటి వరకు పుష్ప లుక్ లో కనిపించిన అల్లు అర్జున్‌( Allu arjun ) గడ్డం మరియు జుట్టు తగ్గించడం చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన హడావుడి నెలకొంది.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే పుష్ప సినిమా ( pushpa movie )ను ఇప్పటి కే విడుదల చేయాల్సి ఉంది.కానీ భారీ ఎత్తున ఉండాలనే ఉద్దేశ్యం తో చాలా మార్పులు చేర్పులు చేసి మరీ సినిమా ను మొదలు పెట్టాడు.సినిమా లోని కథ రీత్యా అల్లు అర్జున్‌ తన మాసీ లుక్ నుండి రెగ్యులర్ స్టైలిష్ లుక్ లోకి మారినట్లుగా తెలుస్తోంది.

అందులో భాగంగానే తాజాగా ఒక కమర్షియల్ యాడ్‌ లో అల్లు అర్జున్ పెద్ద గా జుట్టు లేకుండా సింపుల్ గడ్డం లో కనిపించాడు.ముందు ముందు కూడా బన్నీ ఇలాగే కనిపించే అవకాశాలు ఉన్నాయి.

ఇన్నాళ్లు చాలా గడ్డం మరియు చింపిరి జుట్టు తో బన్నీ ని చూసి ఇప్పుడు ఇలా నార్మల్ గా చూడటం చాలా విడ్డూరంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు
Advertisement

తాజా వార్తలు