శ్రీరాముడి పాత్రలో అల్లు అర్జున్ లేదా రామ్ చరణ్

బాహుబలి తీసుకొచ్చిన మార్పు పుణ్యమా అని అందరు పెద్ద పెద్ద సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇటు తమిళంలో 2 పాయింట్ 0, సంఘమిత్ర అనే రెండు పెద్ద బడ్జెట్ సినిమాలు వస్తోంటే, తెలుగు అగ్రనిర్మాత అల్లు అరవింద్ కూడా ఈమధ్యే 500 కోట్ల "రామాయణం" సినిమా సీరీస్ ని నిర్మించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాని అల్లు అరవింద్ కేవలం తన భుజస్కంధాలపైనే మోయట్లేదు.ఆయనతోపాటు మధు మంతెన, ప్రైం ఫోకస్ వారు కూడా నిర్మాణంలో భాగస్వాములు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ రామాయణం మూడు సినిమాల సిరీస్ లో శ్రీరాముడి పాత్ర ఎవరు పోషిస్తారు అనే ప్రశ్న అందర్నీ వేధిస్తోంది.అల్లు అరవింద్ నిర్మాత కావడంతో మెగా క్యాంప్ హీరోనే శ్రీరాముడి పాత్ర పోషించే అవకాశాలు ఎక్కువ.

ఇంకా అవకాశాల గురించి మాట్లాడుకోవడం ఎందుకు కాని, మెగా హీరో ఇందులో రాముడి పాత్ర పోషించడం ఖాయం.మరి ఆ మేగాహీరో ఎవరు ? సాయి ధరమ్ తేజ్ కి అవకాశాలు తక్కువ.అల్లు అర్జున్, రామ్ చరణ్ లేదా వరుణ్ తేజ్ .ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఆ అదృష్టాన్ని దక్కించుకోవాలి.ఈ ముగ్గురిలో ఫిల్టర్ చేస్తే మార్కెట్ ఉన్న రామ్ చరణ్ లేదా అల్లు అర్జున్ వైపే దర్శకనిర్మాతలు చూపు ఉంటుంది.

Advertisement

ఈ ఇద్దరిలోనే ఒకరు శ్రీరాముడిగా కనిపించడం తథ్యం.మరి బావబావమరిదిలో రఘురాముడయ్యేది ఎవరో ! మీరే చెప్పండి .ఇద్దరిలో ఎవరు శ్రీరాముడిగా బాగుంటారో.

ఓరి మీ దుంపతెగ.. అంత్యక్రియల్లో నవ్వులు, డ్యాన్సులేంట్రా.. (వీడియో)
Advertisement

తాజా వార్తలు