మురుగదాస్ బన్నీ కాంబినేషన్ లో గజినీ సీక్వెల్ !

ప్రస్తుతం సైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నారు.

ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.పుష్ప సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

రష్మిక ఇందులో ఒక గిరిజన యువతిగా నటిస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.

Advertisement
Allu Arjun Movie With Murugadoss, Allu Arjun, Murugadoss, Ghajini Sequel, Allu A

మొదటిసారి అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ చాలా మేరకు పూర్తి అయ్యింది.

Allu Arjun Movie With Murugadoss, Allu Arjun, Murugadoss, Ghajini Sequel, Allu A

అయితే అల్లు అర్జున్ ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా గురించి ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.కానీ ఇప్పటికే చాలా డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్నాయి.తాజాగా అల్లు అర్జున్ తమిళ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో ఉండబోతుందని సమాచారం.అంతేకాదు ఎలాంటి కథతో రాబోతున్నాడో కూడా వార్తలు వినిపిస్తున్నాయి.మురుగదాస్ బన్నీ కాంబినేషన్ లో గజినీ సినిమా సీక్వెల్ తెరకెక్కుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.

Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !

ఇంతకు ముందే అల్లు అరవింద్ గజనీ 2 టైటిల్ ను రిజిస్టర్ చేయించారని వీరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోందని వార్తలు వచ్చాయి.ప్రస్తుతం మురుగదాస్ పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడని తెలుస్తుంది.

Advertisement

చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో.

తాజా వార్తలు