పుష్ప 2 టీజర్ రీ క్రియేట్ చేసిన బుడ్డోడు.. చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ఇటీవల నటించినటువంటి చిత్రం పుష్ప.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో సుకుమార్ ( Sukumar ) ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా పుష్ప 2( Pushpa 2 ) సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో షూటింగ్ పనులు కూడా త్వరలోనే పూర్తి చేయబోతున్నారు.

ఇటీవల పుష్ప 2 సినిమా నుంచి అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ వీడియో విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇందులో అల్లు అర్జున్ అమ్మ వారి గెటప్ లో కనిపించి అందరిని సందడి చేశారు .ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తోనే ఈ టీజర్ వీడియోని కట్ చేసి విడుదల చేశారు.ఇక ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

Advertisement

ఈ టీజర్ వీడియో చూస్తేనే సినిమా ఎలా ఉండబోతుందో స్పష్టంగా అర్థమవుతుంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈ టీజర్ వీడియోని కూడా రీ క్రియేట్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఓ బుడ్డోడు అచ్చం పుష్ప గెటప్ లో కనిపించి టీజర్ లో ఏ విధంగా అయితే పుష్పరాజ్ నటించారో అదేవిధంగా నటించి సందడి చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వీడియో పుష్పం మేకర్స్ వరకు వెళ్ళింది.

ఇక ఈ వీడియోని పుష్ప నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ టీజర్ రీక్రియేట్ చేసినవారిని అభినందించింది.టీజర్ రీక్రియేట్ చేసిన వారిపై ప్రశంసలు కురిపించింది.

ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.

అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు