సుకుమార్ మీద కోపంతో ఉన్న అల్లు అర్జున్ అభిమానులు...

గేమ్ చేంజర్( Game Changer ) సినిమాతో రామ్ చరణ్( Ram Charan ) 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబడతాడు అంటూ ఈ సినిమాని చూసిన సుకుమార్( Sukumar ) కొన్ని సంచలన వ్యాఖ్యలైతే చేశాడు.

ఇక దాంతో పాటుగా ఆయనకు నేషనల్ అవార్డు కూడా వస్తుంది అంటూ ఆయన చేసిన వాక్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

నిజానికి రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమాలో( Rangasthalam ) రామ్ చరణ్ తనదైన రీతిలో తన నట విశ్వరూపాన్ని చూపించి తెలుగు సినిమా ప్రేక్షకులందరిని ఆకట్టుకున్నాడు.నిజానికి ఈ సినిమా కనుక పాన్ ఇండియాలో రిలీజ్ అయితే మాత్రం భారీ రికార్డు లను కొల్లగొట్టడమే కాకుండా రామ్ చరణ్ కి నేషనల్ అవార్డును( National Award ) కూడా కట్టబెట్టేది.

Allu Arjun Fans Angry With Sukumar Details, Allu Arjun Fans , Sukumar, Allu Arju

కానీ ఈ సినిమా తెలుగులో మాత్రమే రిలీజ్ అయి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ను కొట్టింది.మొత్తానికైతే ఈ సినిమాతో రామ్ చరణ్ ఒక మెట్టు పైకి ఎదిగాడనే చెప్పాలి.ఇక తన నటన విషయంలో మాత్రం చాలా వరకు అప్డేట్ అయ్యాడు.

ఇక గేమ్ చేంజర్ సినిమాని చూసిన సుకుమార్ మాత్రం ఈ సినిమాతో ఆయనకు తప్పకుండా నేషనల్ అవార్డు వస్తుందంటూ కొన్ని కామెంట్లైతే చేశాడు.మరి దీంతో అల్లు అర్జున్ అభిమానులు( Allu Arjun Fans ) కొంతవరకు డిసప్పాయింట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది.

Advertisement
Allu Arjun Fans Angry With Sukumar Details, Allu Arjun Fans , Sukumar, Allu Arju

ఎందుకంటే పుష్ప 2 సినిమా( Pushpa 2 Movie ) భారీ రేంజ్ లో ముందు దూసుకెళ్తున్న సమయంలో సుకుమార్ రామ్ చరణ్ సినిమాని మెచ్చుకోవడం పట్ల కొంతమంది అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Allu Arjun Fans Angry With Sukumar Details, Allu Arjun Fans , Sukumar, Allu Arju

కానీ సుకుమార్ మాత్రం వాటిని వేటిని పట్టించుకోకుండా అటు రామ్ చరణ్, ఇటు అల్లు అర్జున్ ఇద్దరు తనకు సన్నిహితులే అంటూ ముందుకు సాగుతున్నాడు.ఇక దాంతో పాటుగానే ఆయన తన తదుపరి సినిమాని కూడా రామ్ చరణ్తో చేయబోతున్నాడు కాబట్టి ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తే రామ్ చరణ్ కూడా భారీగా పెరుగుతుంది.తద్వారా ఆయన చేసే సినిమాకి కలెక్షన్స్ కి కూడా భారీగా వస్తాయనే ఉద్దేశ్యంతోనే సుకుమార్ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు