‘నోటా’తో అల్లు అర్జున్‌కు సంబంధం ఉంది.. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు

విజయ్‌ దేవరకొండ ‘గీత గోవిందం’ చిత్రం తర్వాత చేసిన చిత్రం ‘నోటా’.

అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం భారీ ఎత్తున అంచనాలను మూట కట్టుకుని ఉంది.

తెలుగుతో పాటు ఈ చిత్రంను తమిళంలో కూడా తెరకెక్కించారు.ద్వి బాష చిత్రంగా రూపొందిన ఈ చిత్రంపై సినీ వర్గాల వారు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తమిళంలో ఇప్పటి వరకు ఏ ఒక్క తెలుగు హీరో కూడా రాణించలేక పోయాడు.అక్కడ సరైన గుర్తింపును దక్కించుకోవడంలో విఫలం అయ్యారు.

Allu Arjun Declined Nota Movie Offer

‘నోటా’ చిత్రంతో ఆ లోటును విజయ్‌ దేవరకొండ తీర్చుతాడని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు.భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంతో విజయ్‌ దేవరకొండ తమిళనాట భారీ బ్లాక్‌ బస్టర్‌ దక్కించుకుంటాను అంటూ నమ్మకంగా ఉన్నాడు.ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో జ్ఞానవేల్‌ రాజా నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం మొదట అల్లు అర్జున్‌ వద్దకు వెళ్లినట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.

Advertisement
Allu Arjun Declined Nota Movie Offer-‘నోటా’తో అల్లు �

తెలుగుతో పాటు తమిళంలో ఈ చిత్రంను రూపొందించేందుకు బన్నీ వద్దకు ఈ కథను తీసుకు వెళ్లిన ఆనంద్‌ శంకర్‌కు మెగా హీరో నో చెప్పాడు.

Allu Arjun Declined Nota Movie Offer

నా పేరు సూర్య చిత్రం తర్వాత చూద్దాం అన్నట్లుగా పక్కకు పెట్టాడు.కాని నా పేరు సూర్య చిత్రం ఫ్లాప్‌ అవ్వడంతో ఆనంద్‌ శంకర్‌తో సినిమా చేసేందుకు బన్నీ ఆసక్తి చూపించలేదు.దాంతో వెంటనే విజయ్‌ దేవరకొండ వైపు ‘నోటా’ అడుగులు పడ్డాయి.

దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా విజయ్‌ దేవరకొండ ఈ చిత్రంలో నటించి మెప్పించాడు.అద్బుతమైన నటనతో పాటు ఆకట్టుకునే విధంగా ఉన్న స్క్రీన్‌ప్లే కారణంగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని అంతా అంటున్నారు.

ఈ చిత్రం సక్సెస్‌ అయితే బన్నీ అయ్యో మంచి ఛాన్స్‌ మిస్‌ అయ్యానే అనే బాధ పడటం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.నోటాతో తెలుగు స్టార్‌ తమిళంలో ఎంట్రీ ఇస్తున్నాడు.

టూత్ పేస్ట్ పళ్లకే కాదు.. ఇలా కూడా వాడొచ్చు!!

ఇది సక్సెస్‌ అయితే తమిళనాట విజయ్‌ దేవరకొండ చరిత్ర సృష్టించినట్లు అవుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు