Allu Arjun Allu Sneha : ఐకాన్ స్టార్ వీడియో షేర్ చేసిన భార్య.. అల్లు అర్జున్ అలా చేయడంతో..

అల్లు అర్జున్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.ఈయన తన సినిమాలతో, తన స్టైల్ తో రోజురోజుకూ అభిమానులను పెంచుకుంటు పోతున్నాడు.

అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి తగినంత సమయం కేటాయించి కుటుంబంతో ఆనందంగా గడుపుతాడు.సినిమా మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చినా కుటుంబంతో గడపడానికే అల్లు అర్జున్ ఇష్ట పడుతుంటాడు.

ఇక ఇప్పుడు తన కొత్త సినిమా ఇంకా షూట్ స్టార్ట్ కాకపోవడంతో ప్రెజెంట్ వారితోనే సమయం గడుపుతున్నాడు.గత ఏడాది పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈయన పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా కోట్ల రూపాయలు వసూలు చేసి నిర్మాతలను లాభాలను తెచ్చిపెట్టింది.

Advertisement

ఇక ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉంది.పుష్ప ది రూల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే షూట్ స్టార్ట్ కాబోతుంది.

పుష్ప పార్ట్ 1 భారీ హిట్ అవ్వడంతో ఈసారి పార్ట్ 2 ను మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడానికి సుకుమార్ పక్కా స్క్రిప్ట్ తో సిద్ధం అవుతున్నాడు.అందుకే పార్ట్ 1 రిలీజ్ అయ్యి ఏడాది గడుస్తున్న ఇంకా ఈ పార్ట్ 2 స్టార్ట్ అవ్వలేదు.

మరి నవంబర్ లోనే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ కాబోతుంది అని తెలుస్తుంది.

ఇదిలా ఉండగా ఈ వచ్చిన గ్యాప్ ను అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు.మళ్ళీ షూట్ స్టార్ట్ అయితే చాలా రోజుల వరకు తన ఫ్యామిలీతో గడపడం కుదరదు.ఈ క్రమంలోనే తన భార్య, పిల్లలతో గడుపుతున్న మూమెంట్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?

తాజాగా ఈయన భార్య ఒక వీడియో షేర్ చేసింది.ఇందులో అల్లు అర్జున్ కారు నడుపుతూ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్న చిన్న వీడియో క్లిప్ షేర్ చేయగా ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు