బన్నీతో పీరియాడిక్ డ్రామా.. ఏ డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబో అంటే ప్రేక్షకుల్లో అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉంటాయి.

ఎందుకంటే ఈ కాంబోలో ఇప్పటికే ముచ్చటగా మూడు సినిమాలు రాగా మూడు కూడా సూపర్ హిట్ అయ్యాయి.

జులాయి,( Julayi ) సన్ ఆఫ్ సత్యమూర్తి,( Son of Satyamurthy ) అల వైకుంఠపురములో( Ala Vaikhuntapuramuloo ) సినిమాలు మూడు కూడా మంచి హిట్ అయ్యాయి.ఇక హ్యాట్రిక్స్ హిట్ తమ ఖాతాలో వేసుకున్న తర్వాత మరోసారి ఈ కాంబో కలిసి పని చేయబోతుంది.

ఇటీవలే ఈ ప్రాజెక్ట్ అఫిషియల్ అప్డేట్ వచ్చింది.తమ నాల్గవ సినిమాను అఫిషియల్ గా ప్రకటించగా ఈ సినిమాపై అనౌన్స్ మెంట్ రోజే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.

ఇక ఈ సినిమా విషయంలో తాజాగా స్టోరీ గురించి ఒక అప్డేట్ వైరల్ అయ్యింది.

Advertisement

లీక్ అయిన వార్తల ప్రకారం ఈ సినిమా కథ పీరియాడిక్ డ్రామా( Periodic Drama ) అని తెలుస్తుంది.సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని టాక్ నడుస్తుంది.ఇలా వీరి 4వ ప్రాజెక్ట్ ను గట్టిగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

కాగా ఈ సినిమాను గీతా ఆర్ట్స్ తో కలిసి హారిక హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందించనున్నాడు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రూల్ (Pushpa The Rule) చేస్తున్న విషయం విదితమే.ఇది సగానికి పైగానే షూట్ పూర్తి చేసుకుని ప్రజెంట్ శరవేగంగా జరుగుతుంది.అలాగే త్రివిక్రమ్ కూడా మహేష్ బాబుతో ప్రజెంట్ గుంటూరు కారం (Guntur Kaaram) చేస్తున్నాడు.

ఇలా ఈ ఇద్దరి ప్రాజెక్టులు పూర్తి అయితే కానీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది.

ఆరోగ్యానికి సమోసా మంచిదా? బర్గర్ మంచిదా?.. అధ్యయనంలో తేలిందిదే...
Advertisement

తాజా వార్తలు