హమ్మయ్య పుష్ప 2 అధికారిక క్లారిటీ.. ఇక తగ్గేదే లేదు

అల్లు అర్జున్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కి గత సంవత్సరం డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే.

ఆ సినిమా విడుదలైన సమయం లోనే సీక్వెల్ గురించి అధికారిక ప్రకటన వచ్చింది.

సినిమా ను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు సుకుమార్ అధికారికంగా ప్రకటించి మొదటి భాగం ను గత సంవత్సరం డిసెంబర్లో విడుదల చేయడం జరిగింది.రెండవ భాగంలో ఇదే సంవత్సరం జనవరిలోనే ప్రారంభించాల్సి ఉంది.కానీ పుష్ప సినిమా బాలీవుడ్ లో ఓ రేంజ్ లో వసూళ్ల ను దక్కించుకుంది.100 కోట్ల కు పైగా కలెక్షన్స్ నమోదు చేసిన పుష్ప సినిమా సీక్వెల్ అంటే అదే స్థాయిలో ఉండాలి అనే ఉద్దేశం తో హిందీ ప్రేక్షకుల అభివృద్ధికి తగ్గట్టుగా రెండవ భాగం స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నారు.

పుష్ప 2 కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ దాదాపుగా పది నెలల నుండి కొనసాగుతోంది.ఈ సంవత్సరం అసలు పుష్ప సీక్వెల్ షూటింగ్ ప్రారంభమవుతుందా లేదా అంటూ కొందరు అల్లు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎట్టకేలకు సుకుమార్ టీం నుండి అనధికారికంగా సమాచారం అందుతోంది.

పుష్ప 2 సినిమా ను నవంబర్ 7వ తారీఖున ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది.నవంబర్ ఏడో తారీఖున మొదటి షెడ్యూల్ ప్రారంభించి దాదాపుగా 25 నుండి 30 రోజుల పాటు ఏక ధాటిగా చేయబోతున్నారట.

Advertisement

మొదటగా భారీ యాక్షన్ హై వోల్టేజ్ సన్నివేశాలను సుకుమార్ తరకెక్కించేందుకు ఏర్పాటు చేస్తున్నాడని సమాచారం అందుతుంది.అల్లు అర్జున్ మరియు రష్మిక మందన ల కాంబినేషన్ లో కొన్ని సన్నివేశాలను కూడా ఈ షెడ్యూల్లో చిత్రీకరించాల్సి ఉంటుందని తెలుస్తుంది.

ఇక బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరోయిన్ తో ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయించే అవకాశం ఉందని కూడా సమాచారం అందుతుంది.

Advertisement

తాజా వార్తలు