Minister Botsa Satyanarayna : ప్రజాస్వామ్యంలో పొత్తులనేవి కామన్..: మంత్రి బొత్స

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ప్రజాస్వామ్యంలో పొత్తులనేవి కామన్ అని చెప్పారు.

40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు పొత్తుల కోసం దిగజారారని విమర్శించారు.గతంలో బీజేపీని టీడీపీ నేతలు ఎలా తిట్టారో రాష్ట్ర ప్రజలంతా చూశారన్నారు.

బీజేపీ నేతలు గతంలో చంద్రబాబు( Chandrababu Naidu )ను కట్టప్పతో పోల్చారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

కానీ టీడీపీ - జనసేన పొత్తుల( TDP Janasena ) కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు.ఈ క్రమంలోనే అధికారం ముఖ్యం కాదన్న మంత్రి బొత్స నైతిక విలువలు ముఖ్యమని స్పష్టం చేశారు.అలాగే వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో ఫ్యాన్ ప్రభంజనమే కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
How Modern Technology Shapes The IGaming Experience

తాజా వార్తలు