ఇకపై అలాంటి తప్పు చేస్తే ఒట్టు అంటున్న అల్లరి నరేష్

టాలీవుడ్ లో రాజేంద్రప్రసాద్ తర్వాత కామెడీ చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిన నటుడు అల్లరి నరేష్.

సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న అల్లరి నరేష్.

కెరియర్ ఆరంభంలో భాగానే సక్సెస్ లు అందుకున్నాడు.ఈ జెనరేషన్ హీరోలలో ఒక ఏడాదిలో ఎక్కువ సినిమాలు చేసిన నటుడుగా కూడా అల్లరి నరేష్ గుర్తింపు తెచ్చుకున్నాడు.

Allari Naresh Focus On Different Stories, Tollywood, Telugu Cinema, Naandi Movie

అయితే అతని తండ్రి చనిపోయిన తర్వాత మళ్ళీ కామెడీ చిత్రాలతో నరేష్ కి హిట్ ఇచ్చే దర్శకుడే లేకుండా పోయాడు.కామెడీ ప్రధానంగా అతను చేసిన సినిమాలు అన్ని కూడా ఒకదానిని మించి ఒకటి డిజాస్టర్ అవుతూ వచ్చాయి.

పదేళ్ళ నుంచి సాలిడ్ హిట్ లేకుండా పోయింది.అయితే నరేష్ మాత్రం తనకు భాగా అలవాటైన కామెడీతోనే హిట్ కొట్టాలని డిఫరెంట్ కంటెంట్ సినిమాలు వచ్చినా కూడా రిజక్ట్ చేస్తూ వచ్చాడు.

Advertisement

అయితే మహర్షి సినిమాలో సీరియస్ పాత్రలో ప్రేక్షకులు తనని రిసీవ్ చేసుకోవడంతో నాంది సినిమా చేశాడు.తనకి అలవాటైన జోనర్ కి భిన్నంగా ఈ సినిమాలో నరేష్ నటించాడు.

చేయని తప్పుకి శిక్ష అనుభవించే ఖైదీగా అతని పాత్ర ఈ సినిమాలో ఉంటుంది.సింపుల్ గా ఉన్నంతలో బ్రతుకుదాం అని అనుకునే సాధారణ మధ్యతరగతి యువకుడు జీవితంలో చేయని తప్పుకి పోలీసుల చేత శిక్ష అనుభవించే ఖైదీగా అతని పాత్రని మలిచిన విధానం అందరిని ఆకట్టుకుంది.

దీంతో అతని అప్రతిహిత డిజాస్టర్ లకి నాంది సినిమాతో బ్రేక్ పడింది.ఈ సినిమా ద్వారా తనలోని పూర్తి స్థాయి నటుడుని నరేష్ బయటకి తీసుకొచ్చి పరిచయం చేశాడు.

ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కూడా నరేష్ లో మరో కొత్త కోణం చూపించాడని ప్రశంసలు కురిపించారు.ఈ నేపధ్యంలో ఇకపై కంటెంట్ బేస్ కథలు వచ్చినప్పుడు గుడ్డిగా రిజక్ట్ చేసే పని మాత్రం చేయనని నరేష్ చెబుతున్నాడు.

మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు దీన్ని తింటే ఏమవుతుందో తెలుసా..?

గతంలో కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలు వస్తే తనకి సెట్ కావని వదిలేసేవాడినని, అయితే ప్రేక్షకులు తనని ఎలా అయినా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని నాంది సినిమాతో క్లారిటీ వచ్చిందని చెప్పాడు.ఈ నేపధ్యంలో ఇకపై చేయబోయే సినిమాలు కచ్చితంగా బలమైన కథ, కథనం ఉండే విధంగా చూసుకుంటానని చెప్పుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు