CEO Vikas Raj : లోక్ సభ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు: సీఈవో వికాస్ రాజ్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు( Lok Sabha Elections ) పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని సీఈవో వికాస్ రాజ్( CEO Vikas Raj ) తెలిపారు.

ఈ మేరకు రాష్ట్రంలో సుమారు 90 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ఇందుకోసం సుమారు లక్షా 80 వేల మంది వరకు సిబ్బంది అవసరం అవుతారని తెలిపారు.ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్న సీఈవో వికాస్ రాజ్ గతేడాది 2.09 లక్షల మంది పోస్టల్ ఓట్లు వేశారని పేర్కొన్నారు.

అనంతరం కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు( Contonment Assembly By-Election ) ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు.అలాగే ఇంటి వద్ద ఓటింగ్ కోసం ఏప్రిల్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.నిబంధనలకు లోబడే ప్రచారం చేసుకోవాలన్న సీఈవో వికాస్ రాజ్ సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!
Advertisement

తాజా వార్తలు