పవన్ గెలుపు పై అలీ రియాక్షన్.. వాళ్లే నిర్ణయిస్తారంటూ కామెంట్స్?

ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలలో కూటమి ఘన విజయం సాధించింది.

ఇక సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సైతం ఈ ఎన్నికలలో అద్భుతమైన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగాను, పలు శాఖలకు మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే.

ఇక పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయం సాధించడంతో సినిమా సెలబ్రిటీలందరూ కూడా ఈయనకి శుభాకాంక్షలు తెలిపారు.ఈ క్రమంలోనే తన స్నేహితుడు వైసీపీ నేత అలీ( Ali ) సైతం పవన్ కళ్యాణ్ గెలుపు పై స్పందించారు.

ఈ సందర్భంగా ఆలీ పవన్ కళ్యాణ్ విజయం పట్ల స్పందిస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలలో గొప్ప మెజారిటీతో విజయం సాధించిన చంద్రబాబు నాయుడు( Chandra Babu Naidu ) అలాగే నా మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాధించిన గొప్ప విజయానికి అభినందనలని తెలిపారు.10 సంవత్సరాల పవన్ కష్టాన్ని ప్రజలు ఆదరించారని తెలిపారు.నేనెప్పుడూ ఒకే విషయం చెబుతాను అది రాజకీయాలలో కావచ్చు లేదా సినిమాలలో కావచ్చు.

Advertisement

ప్రజలే న్యాయనిర్ణేతలు వారిచ్చిన తీర్పే ప్రతి ఒక్కరు గౌరవించాలి అని ఆయన తెలిపారు.

రాజకీయాలలో అయినా సినిమాలలో ఆయన గెలుపు ఓటమి అనేది కేవలం ప్రజల చేతిలోనే ఉంటుందని అలీ ఈ సందర్భంగా వెల్లడించారు.ఇక పవన్ కళ్యాణ్ తనకు ప్రాణ స్నేహితుడా అయినప్పటికీ అలీ మాత్రం జనసేనకు( Janasena ) కాకుండా వైసీపీకి మద్దతు తెలిపారు గత ఎన్నికలలో భాగంగా ఈయన వైయస్సార్సీపి పార్టీకి ప్రచార కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఆ పార్టీలో కొనసాగుతూ ఏపీ ఎలక్ట్రానిక్ సలహాదారునిగా పదవి కూడా అందుకున్నారు.కానీ ఈ ఎన్నికలలో మాత్రం ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా పోటీ చేయాలని భావించిన టికెట్ రాలేదు.

దీంతో ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు అలాగే పార్టీ వ్యవహారాలకు కూడా ఆలీ పూర్తిగా దూరంగా ఉన్నారు.

పెండింగ్ పనులు తోరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Advertisement

తాజా వార్తలు