అలర్ట్.. హ్యాకర్ల చేతికి దొరికిన ఆ యాప్ యూజర్ల పర్సనల్ డేటా

తాజాగా మరో నయా స్కామ్ వెలుగులోకి వచ్చింది.ఒక యాప్ యూజర్ల పర్సనల్ డేటా హ్యాకర్ల చేతికి చిక్కింది.

లెట్‌మీస్పై అనే యాప్‌( LetMeSpy app )ను హ్యాకర్లు హ్యాక్ చేశారు.ఆ యాప్ యూజర్ల వ్యక్తిగత సమచారాన్ని దొంగలించారు.

జూన్ 21 లెట్‌మీస్పై యాప్ హ్యాక్‌కు గురైందనే విషయం బయటకు వచ్చింది.హ్యాక్ చేసి యూజర్ల మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్లు, అడ్రస్, సందేశ కంటెంట్ యాక్సెస్ చేసినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

హ్యాకింగ్‌కు గురి కావడంతో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నవారు డిలీట్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.

Alert.. The Personal Data Of The App Users Found In The Hands Of Hackers Users P
Advertisement
Alert.. The Personal Data Of The App Users Found In The Hands Of Hackers Users P

ఈ యాప్ పిల్లలపై తల్లిదండ్రులు నిఘా పెట్టడానికి రూపొందించారు.పిల్లలకు తెలియకుండా స్మార్ట్ ఫోన్ లో( Smart phone ) వాళ్లు ఏమి చేస్తున్నారో ఈ లెట్‌మీస్పై యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.ఫోన్ హోమ్ స్క్రీన్‌లో గుర్తించలేని విధంగా ఆ యాప్ ను అభివృద్ది చేశారు.

ఈ యాప్ ను గుర్తించడం లేదా ఆన్‌ఇన్ స్టాల్ చేయడం అనేది కూడా సవాల్ గా మారింది.ఈ యాప్ ఇతరులకు తెలియకుండా లేదా ఒప్పందం లేకుండా తరచుగా ఇన్‌స్టాల్ అవుతాయి.

ఈ యాప్ ను ఇన్‌స్టాల్ చేసిన వెంటనే ఆ యాప్ ఫోన్‌కు టెక్ట్స్ మెసేజ్‌లను పంపుతుంది.

Alert.. The Personal Data Of The App Users Found In The Hands Of Hackers Users P

కాల్ లాగ్ లు, కచ్చితమైన లొకేషన్, కాల్ లాగ్ ల సమాచారాన్ని సీక్రెట్ గా పంపుతూ ఉంటుంది.యాప్ ను ఇన్ స్టాల్ చేసిన వ్యక్తి నిజ సమయంలో లక్ష్యాన్ని అనుసరించేలా చేస్తుంది.పిల్లలపై తల్లిదండ్రులు నిఘా పెట్టే ఈ అప్లికేషన్‌లో చాలా బగ్‌లు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.

Red Eyes : కళ్లు ఎర్రగా ఉండడం ఏ వ్యాధి లక్షణమో తెలుసా..?

దీంతో ఈ యాప్ ను డౌన్ లౌడ్ చేసుకున్నవారు డిలీట్ చేయడం మంచిదని, లేకపోతే మీ సమాచారాన్ని హ్యాకర్లు దొంగలించే అవకాశముందని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు