అఖిల్ అందుకే ఫ్లాప్ అయ్యింది అన్న హీరోయిన్

అఖిల్ ఎందుకు ఫ్లాప్ అయ్యిందంటే ఏమని సమాధామిస్తాం.కథ బాగాలేదు అంటాం, లేదంటే రొటీన్ గా ఉంది అంటాం.

సినిమా పరిజ్ఞానం ఎక్కువుంటే స్క్రీన్ ప్లే లోటుపాట్లు చెబుతాం.కాని అఖిల్ ఫ్లాప్ అవడానికి మరో కారణం చెబుతోంది ఆ చిత్ర హీరోయిన్ సయేశ సైగల్.

ఈ భామ ఒక నేషనల్ దినపత్రికతో మాట్లాడుతూ " అఖిల్ ఫ్లాప్ అవడానికి అందులో ఎమోషన్ లేకపోవడమే కారణం.నేను అఖిల్ జంటగా బాగున్నప్పటికీ, మా ఇద్దరి మధ్య కేమిస్త్రి లేదు.

మా మధ్య రోమాన్స్ ఉండాల్సింది.అఖిల్ నాకు చిత్రంలో ఐ లవ్ యు కుడా చెప్పలేదు.

Advertisement

మా మధ్య రోమాన్స్ లేకపోవడం చిత్రాన్ని దెబ్బతీసింది.మా కేమిట్రీ బాగుండుంటే యువత థియేటర్లకు వచ్చి సినిమా చూసేవారు.

" అంటూ తన దృష్టిలోని కారణాలు బయటపెట్టింది సయేశ.ఇక ఈ టీనేజ్ బ్యూటి ప్రస్తుతం అజయ్ దేవగన్ డ్రీం ప్రాజెక్ట్ శివాయ్ లో నటిస్తోంది.

ఈ విషయం పై స్పందిస్తూ " అజయ్ సార్ తన డ్రీం ప్రాజెక్ట్ లో నన్ను హీరోయిన్ గా తీసుకోవడం చాలా సంతోషించే విషయం.ఈ చిత్ర ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు నేనే సెలెక్ట్ అవుతానని అనుకోలేదు.

కాని ఆదృష్టం నన్నే వరించింది.ఈ సినిమా మీద నేను చాలా ఆసక్తిగా ఉన్నాను " అంటూ ముగించింది సయేశ.

త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరోయిన్లు ఎవరో తెలుసా?
Advertisement

తాజా వార్తలు