'ఏజెంట్' ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ ఫిక్స్.. ఫ్యాన్స్ కోసం మేకర్స్ భారీ ఏర్పాట్లు!

అక్కినేని అఖిల్ (Akhil Akkineni) టాలెంట్ గురించి అందరికి తెలుసు.ఈయన డ్యాన్స్ లో నటనలో ప్రేక్షకుల చేత నూటికి నూరు మార్కులు వేయించు కున్నారు.

కానీ పాపం ఈయనకు మొదటి నుండి సినిమాలు అయితే కలిసి రావడం లేదనే చెప్పాలి.ఏ సినిమా చేసిన హిట్ టాక్ దక్కించుకుంది లేదు.

మరి గత సినిమా బ్యాచిలర్ తో ఎట్టకేలకు మొదటి హిట్ అయితే తన ఖాతాలో వేసుకున్నాడు.

Akhil Akkineni Agent Pre Release Event Update, Akhil Akkineni, Agent Movie, Agen

ఇక లవ్ స్టోరీతో హిట్ కొట్టిన అఖిల్ ఇప్పుడు మాస్ హీరోగా తనని తాను మార్చుకుని నెక్స్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో ఏజెంట్ (Agent) సినిమాను చేస్తున్నాడు.యాక్షన్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అఖిల్ గత రెండేళ్లుగా టైం కేటాయించి మరొక సినిమా చేయకుండా ఈ సినిమా కోసం కష్ట పడుతున్నాడు.

Akhil Akkineni Agent Pre Release Event Update, Akhil Akkineni, Agent Movie, Agen
Advertisement
Akhil Akkineni Agent Pre Release Event Update, Akhil Akkineni, Agent Movie, Agen

ఈ సినిమాను సురేందర్ 2 సినిమాస్ తో కలిసి ఏకే ఎంటెర్టాన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.అఖిల్ రా ఏజెంట్ గా కనిపించ నుండగా.ఈయనకు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది.

కీలక పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) నటిస్తున్నాడు.అలాగే హిప్ హప్ తమిజా సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

Akhil Akkineni Agent Pre Release Event Update, Akhil Akkineni, Agent Movie, Agen

ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతున్నారు.ఇక రిలీజ్ కు మరో వారం మాత్రమే ఉండడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (Agent Pre Release Event) చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 18న కాకినాడలో గ్రాండ్ గా ఫ్యాన్స్ (Akkineni Fans) మధ్య ఘనంగా జరిగేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మరి ఈ ఈవెంట్ పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?
Advertisement

తాజా వార్తలు