అజిత్ బన్నీ కాంబినేషన్ లో జక్కన్న భారీ మల్టీస్టారర్.. ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ అవుతాయా?

ఎస్.ప్రస్తుతం ఇదే వార్త తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

కాగా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.ఈ మల్టీస్టారర్ సినిమాలలో కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ హీరోలు కలిసి నటిస్తున్నారు.

కాగా తాజాగా కూడా మరో మల్టీస్టారర్ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.టాలీవుడ్‌లో రైటర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజయేంద్ర ప్రసాద్( Vijayendra Prasad ).ఈయన ఆర్ఆర్ఆర్ లాంటి సూపర్ హిట్ సినిమా కథ అందించి ఆయన ఇంటర్నేషనల్ రైటర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.

మరి అలాంటి విజయేంద్ర ప్రసాద్ ఇప్పుడు మరో మల్టీ‌స్టారర్‌ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.అంతే కాదు ఈ సినిమాకు డైరెక్టర్‌గా రాజమౌళినే( Rajamouli ) వ్యవహరించబోతున్నాడని టాక్.మహేష్ ప్రాజెక్ట్ తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా ఇదే అని తెలుస్తోంది.

Advertisement

ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతోంది.ఇక ఈ మల్టీస్టారర్ మూవీలో హీరోలుగా అజిత్, అల్లు అర్జున్‌ను( Ajith , Allu Arjun ) ఎంచుకోగా కథ బాగా నచ్చడంతో వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

ఇదే కనుక నిజమైతే ఈసారి రికార్డులను ఆపడం ఎవరి తరం కాదు.ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అని తెలుస్తోంది.మరి ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలి అంటే విజయేంద్ర ప్రసాద్ లేదంటే రాజమౌళి స్పందించేంతవరకు వేచి చూడాల్సిందే.

ఇకపోతే అల్లు అర్జున్ విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇక మరోవైపు రాజమౌళి మహేష్ బాబుతో తెరకెక్కించబోయే సినిమాకు సంబంధించిన పనులు చూసుకుంటూ బిజీబిజీగా గడుపుతున్నారు.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?
Advertisement

తాజా వార్తలు