సంక్రాంతికి వస్తున్నాం ఐశ్వర్య పాత్రను ముగ్గురు రిజెక్ట్ చేశారా.... అందుకే వద్దనుకున్నారా?

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సినిమాల ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.

అయితే ఈ సంక్రాంతి బరిలో విక్టరీ వెంకటేష్ ( Venkatesh ) నటించిన సంక్రాంతికి వస్తున్నామనే( Sankranthiki Vasthunnam Movie ) సినిమా కూడా విడుదల అయ్యి మంచి  సక్సెస్ అందుకుంది.

అనిల్ రావిపూడి ( Anil Ravipudi ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్ మీనాక్షి చౌదరి( Meenakshi Chowdary ) ఐశ్వర్య రాజేష్( Aishwarya Rajesh ) హీరో హీరోయిన్లుగా నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.

Aishwarya Rajesh Interesting Comments On Her Role On Sankranthiki Vastunnam Movi

ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో భాగంగా నటి ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ తన పాత్ర గురించి పలు విషయాలను బయటపెట్టారు.ఈ సినిమాలో భర్తను అమితంగా ప్రేమించే ఇల్లాలి పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటించారు అయితే ఈ పాత్రకు ఈమె ఫస్ట్ ఛాయిస్ కాదని ముగ్గురు ఈ సినిమాని రిజెక్ట్ చేసిన తర్వాత తాను సెలెక్ట్ అయ్యానని తెలిపారు.అయితే ఆ ముగ్గురు హీరోయిన్స్ ఎవరు అనే విషయాన్ని ఈమె చెప్పకపోయినా ఎందుకు రిజెక్ట్ చేశారనే విషయాన్ని మాత్రం వెల్లడించారు.

Aishwarya Rajesh Interesting Comments On Her Role On Sankranthiki Vastunnam Movi

ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ భార్య పాత్రలోనూ అలాగే నలుగురు పిల్లల తల్లిగాను కనిపించి సందడి చేశారు.ఇలా నలుగురికి తల్లి పాత్రలో నటించాలి అంటే సాధారణంగా ఏ హీరోయిన్ కూడా సాహసం చేయరు.అలాంటి పాత్రలో ఒకసారి నటిస్తే తిరిగి తమకు అలాంటి పాత్రలే వస్తాయని తద్వారా కెరియర్ కోల్పోవలసి వస్తుందని చాలామంది భావిస్తారు అందుకే ఈ సినిమాని కూడా ముగ్గురు రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.

Advertisement
Aishwarya Rajesh Interesting Comments On Her Role On Sankranthiki Vastunnam Movi

అయితే ఈ పాత్ర గురించి ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ పిల్లల తల్లిగా నటించడం అంటే రిస్క్ కాదని, మంచి అవకాశం అని తెలిపారు.ఈ సినిమాలో మరో హీరోయిన్గా నటించిన మీనాక్షి చౌదరి సైతం ఇదివరకే లక్కీ భాస్కర్ సినిమాలో ఓ కుర్రాడికి తల్లి పాత్రలో నటించిన ఆమె మాత్రం స్టార్ హీరోయిన్గా దూసుకుపోతోంది కదా అంటూ ఐశ్వర్య రాజేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు