ఒకప్పుడు బొగ్గులమ్మే అమ్మాయి.. ఇప్పుడు ఎయిర్ హోస్టెస్.. ఈ యువతి సక్సెస్ స్టోరీకి ఫిదా కావాల్సిందే!

సక్సెస్ అనే పదం చిన్నదే అయినా సక్సెస్ సాధించడం అనేది చిన్న విషయం కాదు.

ఒక వ్యక్తి సక్సెస్ సాధించాలంటే ఆ వ్యక్తి రేయింబవళ్లు తీవ్రస్థాయిలో శ్రమించాల్సి ఉంటుంది.

అయితే ఒకప్పుడు బొగూలమ్మే అమ్మాయి ఇప్పుడు ఎయిర్ హోస్టెస్( Air Hostess ) స్థాయికి ఎదిగింది.గిరిజన అమ్మాయి అయిన ఈ యువతి ఎన్నో ఆవంతరాలు ఎదురైనా తను కన్న కలలను నెరవేర్చుకోవడంతో పాటు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.

ఈ యువతి కుటుంబం పోడు వ్యవసాయం చేయడంతో పాటు కట్టె బొగ్గును అమ్మడాన్ని వృత్తిగా చేసుకుంది.ఈ అమ్మాయి గిరిజన అమ్మాయి( Tribal Woman ) కాగా ఈ అమ్మాయి నివశించే గ్రామ ప్రజల పిల్లలు, బంధువుల పిల్లలు ఉన్నత చదువులు చదవాలని మంచి స్థాయికి చేరుకోవాలని కలలు కనలేదు.

అయితే గోపికా గోవింద్( Gopika Govind ) మాత్రం ఎయిర్ హోస్టెస్ కావాలని కల కనడంతో పాటు ఎంతో కష్టపడి ఆ కలను నెరవేర్చుకున్నారు.

Advertisement

12 సంవత్సరాల వయస్సులో కల కన్న ఈ యువతి ఎంతో 24 సంవత్సరాల వయస్సులో తను కన్న కలను నిజం చేసుకుంది.కేరళ తొలి గిరిజన ఎయిర్ హోస్టెస్ గా గోపికా గోవింద్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.గోపిక కుటుంబానికి చెందిన వాళ్లు అటవీ భూమిని లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తారు.

ఈ గిరిజన జాతిని కరింపలనులు అని పిలుస్తారు.బీఎస్సీ చదివిన గోపిక ఇంటర్నేషన్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ ద్వారా స్కాలర్ షిప్ పొంది హిందీ, ఇంగ్లీష్ భాషలను సైతం నేర్చుకున్నారు.

తొలిసారి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిన గోపిక రెండో ప్రయత్నంలో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సంస్థలో ఎయిర్ హోస్టెస్ గా ఎంపికయ్యారు.ఎనిమిదో తరగతిలో విమానంలో ఎగురురూ విధి నిర్వహణ చేయాలని కల గన్న గోపికా గోవింద్ తన కలను నెరవేర్చుకుని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.ఆమె సక్సెస్ స్టోరీ విని నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

వైరల్ వీడియో : ఏంటి భయ్య.. కోడిని పట్టుకున్నట్లు చిరుతను అలా పట్టేసావ్..
Advertisement

తాజా వార్తలు