ఆహా క్రాష్ పబ్లిసిటీ స్టంట్.. సోషల్‌ మీడియాలో వింత పుకారు

తెలుగు ఓటీటీ ఆహా లో నిన్న రాత్రి నుండి ప్రభాస్ గెస్ట్‌ గా హాజరు అయిన బాలయ్య అన్‌ స్టాపబుల్‌ షో స్ట్రీమింగ్‌ అవుతున్న విషయం తెల్సిందే.

మొదట ప్రకటించిన దాని ప్రకారం నేటి నుండి ఆ ఎపిసోడ్ స్ట్రీమింగ్‌ అవ్వాల్సి ఉంది.

కానీ అభిమానుల డిమాండ్ మేరకు షో ను ముందు రోజు రాత్రి అంటే నిన్న రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్‌ చేయడం జరిగింది.స్ట్రీమింగ్ మొదలు అయిన కొన్ని నిమిషాల్లోనే ఆహా ఓటీటీ క్రాష్‌ అయ్యింది.

లక్షలాది మంది ఒకే సారి లాగిన్ అవ్వడంతో సర్వర్‌ సమస్య తలెత్తి లాగిన్‌ అవ్వడం సమస్యగా మారింది.తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా కూడా లక్షలాది మంది లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించారు.

దాంతో సర్వర్ ఒక్కసారిగా డౌన్ అవ్వడంతో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.ఆహా టీం వెంటనే స్పందించి టెక్నికల్‌ సమస్య కు చింతిస్తున్నాం.

Advertisement

ఒకే సారి అంత మంది ప్రేమ చూపించడంతో ఆహా తట్టుకోలేక పోయింది అన్నట్లుగా మూడు గంటల పాటు శ్రమించి మళ్లీ తీసుకు వచ్చారు.ఆ తర్వాత అంత సజావుగానే సాగింది.

ఆహా ఓటీటీ క్రాష్ ఏమో కానీ రాత్రి నుండి సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలు అయ్యింది.కొందరు తిడుతూ ఉంటే మరి కొందరు ప్రభాస్ రేంజ్

ఇది అంటూ చర్చించుకోవడం మొదలు అయ్యింది.అంత మంది చూడాలి అనుకున్న ఆ షో లో ఏముంది అంటూ కొందరు షో ను చూస్తున్నారట.మొత్తానికి ఆహా క్రాష్ పబ్లిసిటీకి బాగానే పనికి వచ్చింది.

అదే ఇప్పుడు కొందరికి అనుమానాలు తెప్పిస్తుంది.ఆహా క్రాష్ అనేది కేవలం పబ్లిసిటీ స్టంట్ అయ్యి ఉంటుందని.

చేతుల‌ను తెల్ల‌గా, మృదువుగా మార్చే వాసెలిన్‌..ఎలాగంటే?

ఇలా పబ్లిసిటీ విపరీతంగా వస్తుందనే ఉద్దేశ్యంతో ఆహా వారు కావాలని క్రాష్ చేసి ఉంటారు అనేది కొందరి అభిప్రాయం.వింత పుకారును కొందరు ప్రచారం చేస్తూ ఇదే సాక్ష్యం అన్నట్లుగా కొన్ని ఉదాహరణ లు కూడా ఇస్తున్నారు.

Advertisement

మరి ఆహా వారు ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.

తాజా వార్తలు