TDP minorities : విజయవాడలో టిడిపి మైనార్టీల ఆందోళన

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ దినోత్సవాన్ని నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ మైనార్టీలు ఆందోళనకు దిగారు.

టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

హజ్ కమిటీ రాష్ట్ర కార్యాలయం వద్ద మహాత్మా గాంధీ రోడ్డులో మైనార్టీలు బైఠాయించి ధర్నాకు దిగారు.కాగా.

నిరసన తెలువుతున్న మైనార్టీలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ మైనార్టీలు నినాదాలు చేశారు.

మైనార్టీల నిధులను, హక్కులను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు.మైనార్టీల సంక్షేమ పథకాలను జగన్ నిర్వీర్యం చేశారని టీడీపీ మైనార్టీలు మండిపడ్డారు.

Advertisement
మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

తాజా వార్తలు