పామాయిల్ వాడుతున్నారా..అయితే ఇవి తెలుసుకోవాల్సిందే!

వంట‌ల‌కు విరి విరిగా ఉప‌యోగించే ఆయిల్స్‌లో పామాయిల్ ఒక‌టి.ముఖ్యంగా చాలా రకాల స్నాక్స్ ని పామ్ ఆయిల్‌తోనే చేస్తుంటారు.

అలాగే హోట‌ల్స్‌లో‌, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్స్‌లో పామ్ ఆయిల్‌నే ఎక్కువ‌గా వినియోగిస్తుంటారు.ఇందుకు ప్ర‌ధాన కార‌ణం మిగతా వంట నూనెల‌తో పోల్చితే.

పామ్ ఆయిల్ ధరే తక్కువగా ఉంటుంది.పామ్ పండ్ల నుంచి త‌యారు చేసిన పామ్ ఆయిల్ ఇంత‌కీ ఆరోగ్యానికి మంచిదా కాదా.? అంటే ఈ ఆయిల్‌తో ఆరోగ్యానికి మేలు జ‌రుగుతుంది మ‌రియు న‌ష్టం జ‌రుగుతుంది.వాస్త‌వానికి పామ్ ఆయిల్‌లో ఎక్కువ‌గా అన్ సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

ఈ కొవ్వులు గుండెకు ఏ మాత్రం మంచివి కాదు.అందువ‌ల్ల‌, గుండె జ‌బ్బుల‌తో బాధ ప‌డే వారు పామ్ ఆయిల్‌ను అస్స‌లు వాడ‌కూడ‌దు.

Advertisement

అలాగే బ‌రువు త‌గ్గాలి అని ప్ర‌య‌త్నించే వారు కూడా పామ్ ఆయిల్ తీసుకోక‌పోవ‌డ‌మే మంచిద‌ని అంటున్నారు.

ఎందుకంటే, పామ్ ఆయిల్ లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి.అందువ‌ల్ల‌, పామ్ ఆయిల్ తీసుకుంటే బ‌రువు పెరిగే అవ‌కాశం ఉంటుంది.అయితే పామ్ ఆయిల్ తీసుకోవ‌డం వ‌ల్ల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

ముఖ్యంగా విట‌మిన్ ఎ లోపంతో బాధ ప‌డే వారు పామ్ ఆయిల్ తీసుకుంటే చాలా మంచిది.పామ్ ఆయిల్‌లో విట‌మిన్ ఎ పుష్క‌లంగా ఉంటుంది.అలాగే పామ్ ఆయిల్‌లో విట‌మిన్ ఇ కూడా స‌మృద్ధిగా ఉంటుంది.

అందువ‌ల్ల‌, పామ్ ఆయిల్ తీసుకుంటే శ‌రీరం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా ఉంటుంది.ముఖ్యంగా వ‌య‌సు పైబ‌డే కొద్ది వ‌చ్చే ముడ‌త‌లు,మ‌చ్చ‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

పాయి ఆయిల్ వాడ‌టం వ‌ల్ల‌.అందులో ఉండే బీటా-కెరోటిన్ కంటి ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తుంది.

Advertisement

ఇక పామ్ ఆయిల్ తీసుకోవ‌డం వ‌ల్ల‌ అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్స‌ర్ క‌ణాల‌ను నాశ‌నం చేస్తాయి.అయితే పామ్ ఆయిల్‌ను అతిగా మాత్రం తీసుకోరాదు.

‌.

తాజా వార్తలు