ఆ రీజన్ వల్లే సౌత్ సినిమాలు హిట్ అవుతున్నాయి.. అదుర్స్ నటుడు షాకింగ్ కామెంట్స్ వైరల్!

ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాలు సక్సెస్ సాధిస్తుంటే నార్త్ సినిమాలు మాత్రం ఆశించిన ఫలితాలను అందుకునే విషయంలో ఫెయిల్ అవుతున్నాయి.

బాలీవుడ్ ప్రముఖ నటుడు మహేష్ మంజ్రేకర్ ( Mahesh Manjrekar )మాట్లాడుతూ ప్రస్తుతం కంటెంట్ విషయంలో మరాఠీ, మలయాళ( Marathi, Malayalam ) సినిమాలు మాత్రమే టాప్ లో ఉన్నాయని పేర్కొన్నారు.

ఇతర ఇండస్ట్రీలన్నీ సినిమా అంటే కేవలం కమర్షియల్ కోణంలో మాత్రమే చూస్తున్నాయని ఆయన వెల్లడించారు.మరాఠీ సినిమాలో కథలు బాగున్నప్పటికీ పోటీ, స్థాయి లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతోందని మహేష్ మంజ్రేకర్ పేర్కొన్నారు.

సొంత రాష్ట్రంలో సైతం ఈ సినిమాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన తెలిపారు.మహారాష్ట్ర( Maharashtra ) ప్రజలు 100 శాతం హిందీని అర్థం చేసుకోవడం కూడా ఇక్కడ అతి పెద్ద సమస్య అని మహేష్ మంజ్రేకర్ వెల్లడించడం గమనార్హం.

సౌత్ సినిమాల విషయానికి వస్తే వారికి ప్రేక్షకులు భారీ స్థాయిలో ఉంటారని ఆయన తెలిపారు.సౌత్ లో హిందీతో సమానంగా భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్నారని అన్నారు.అందువల్ల వాళ్ల సినిమాలు పాన్ ఇండియా( Pan India ) స్థాయిలో రాణిస్తున్నాయని చెప్పుకొచ్చారు.

Advertisement

మరాఠీ సినిమాలు సైతం అదే స్థాయికి చేరుకుని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తే సక్సెస్ అవుతాయని ఆయన తెలిపారు.

మరాఠీలో నాణ్యమైన సినిమాలు వస్తే మరింత బాగుంటుందని ఆయన కామెంట్లు చేశారు.సౌత్ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా వస్తున్నా గత పదేళ్లలో 8 సినిమాలు భారీ హిట్లుగా నిలిచాయని ఆయన తెలిపారు.మరాఠీ సినిమాల్లో కంటెంట్ ఉన్నప్పటికీ ఇతర భాషల నుంచి గట్టి పోటీ ఎదురవుతోందని మహేశ్ మంజ్రేకర్ కామెంట్లు చేశారు.

ఆయన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మహేష్ మంజ్రేకర్ సౌత్ లో కామెడీ విలన్ రోల్స్ లో ఎక్కువగా నటించారు.ఈయన నటించిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు