అడవి శేష్ కామెంట్స్ ఆ హీరో ఫ్యాన్స్ కు గట్టిగా తగిలినట్లున్నాయి..!

ట్యాలెంట్ ఉన్న హీరోల్లో అడవి శేష్‌ ఒకరు.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కష్టపడి ఇండస్ట్రీ లో నిలిచి గెలిచిన వ్యక్తి అడవి శేష్.

తాజాగా విడుదల అయిన మేజర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా నిలిచిన వ్యక్తి.మేజర్‌ సినిమా లో రియల్‌ హీరో సందీప్ ఉన్ని కృష్ణన్ పాత్రలో నటించి అద్బుతంగా కనిపించిన అడవి శేష్‌ ఇక నుండి చేయబోతున్న ప్రాజెక్ట్‌ లు అన్ని కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ లు అంటూ ఆయన సన్నిహితులు మరియు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మేజర్ సినిమా రెండు మూడు వారాలకు విడుదల అవ్వబోతుంది అన్నప్పటి నుండి ఇప్పటి వరకు అడవి శేష్‌ ఏదో ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడం లేదా ప్రెస్ మీట్ లో పాల్గొనడం చేస్తూనే ఉన్నాడు.రెగ్యులర్‌ గా వార్తల్లో ఉంటున్న అడవి శేష్‌ ఈసారి కూడా మళ్లీ వార్తల్లోకి వచ్చాడు.

అయితే ఈసారి ఆయన కాస్త విభిన్నమైన అంశంతో అది కూడా వివాదాస్పదం అవ్వడంతో వార్తల్లో నిలిచాడు.

Advertisement

తాజాగా అడవి శేష్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు హీరోల్లో కొందరు డైలాగ్స్ ను అరచినట్లుగా చెబుతారు.అలా చెప్పడమే గొప్ప అనుకుంటారు.అలా చెప్పడం వల్ల తాము డైలాగ్స్ ను బాగా చెబుతున్నాం అని వారు అనుకుంటున్నారు.

కాని అసలు విషయం ఏంటీ అంటే మనది నాటకాల నుండి వచ్చిన పరిశ్రమ కనుక చాలా మంది హీరోలు డైలాగ్స్ ను అరచినట్లుగా చెబుతున్నారు.అలా చెప్పడం వల్ల డైలాగ్స్ అంటే అది కూడా మాస్ డైలాగ్స్ అంటే ఇలాగే ఉంటాయేమో.

యాక్షన్ సినిమా ల్లో డైలాగ్స్ ఇలాగే ఉంటాయేమో అంటూ చాలా మంది అభిప్రాయం తో ఉంటున్నారు.అడవి శేష్‌ వ్యాఖ్యలకు ఒక సీనియర్ స్టార్‌ హీరో అభిమానులు కనెక్ట్‌ అయినట్లుగా ఉన్నారు.

వారు అడవి శేష్‌ తమ అభిమాన హీరో గురించే ఆ వ్యాఖ్యలు చేశాడు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.పేర్లు ఎత్తకుండా అడవి శేష్‌ టాలీవుడ్‌ సీనియర్‌ హీరోలకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?
Advertisement