Bollywood Movies Adivi Sesh : అడివి శేష్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 8 బాలీవుడ్ సినిమాలు రిజెక్ట్ ఎందుకో తెలుసా?

టాలీవుడ్ హీరో అడవి శేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అడవి శేషు ప్రస్తుతం వరుస సినిమా హిట్టులతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా అడవి శేష్ నటించిన చిత్రం హిట్ 2.ఈ సినిమా తాజాగా గ్రాండ్ గా విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే.

ఈ సినిమా విడుదల అయ్యి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.ఈ సినిమా ఇంకా మంచి మంచి కలెక్షన్స్ ను సాధించి సూపర్ హిట్ గా పిలుస్తుంది అనే ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ హీరో నాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.కాగా హిట్ 2 సినిమా క్లైమాక్స్ లో హిట్ 3 సినిమాలో నాని హీరోగా నటించబోతున్నాడు అన్న క్రేజీ అప్డేట్ ని కూడా రివీల్ చేశారు.

Advertisement

ఇకపోతే అడవి శేష్ ఒక్కొక్క హీరోకి తనకున్న క్రేజ్ నీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ మరింత పెంచుకుంటున్నాడు.ఇటీవల విడుదల అయినా గూడాచారి, మేజర్ లాంటి సినిమాలు మంచి హిట్ అయిన విషయం తెలిసిందే.

దీంతో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు దక్కింది.దీంతో బాలీవుడ్ లో హీరో అడవి శేషుకి వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నట్లు తెలిపాడు హీరో అడివి శేష్.

ఇంటర్వ్యూలో భాగంగా అడవి శేషు మాట్లాడుతూ తాను ఎనిమిది బాలీవుడ్ సినిమాలను రిజెక్ట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 బాలీవుడ్ ప్రాజెక్టులను హీరో అడవి శేషు రిజెక్ట్ చేశారు అంటే ఆయన క్రేజ్ ఏ విధంగా ఉందోఅర్థం చేసుకోవచ్చు.అయితే అప్పటికే పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల ఆ సినిమా ఆఫర్లను రిజెక్ట్ చేయక తప్పలేదు అని తెలిపారు అడవి శేష్.అయితే ప్రస్తుతం తాను తెలుగులో నాలుగు సినిమాలలో నటిస్తున్నానని అవి హిందీలో కూడా తప్పకుండా విడుదల అవుతాయి అని తెలిపారు అడవి శేష్.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo

హిట్ 2 అయిపోయిన తర్వాత గూడచారి 2 స్క్రిప్ట్ పనులు మొదలు పెడతాం అని తెలిపారు అడవి శేష్.ఇప్పటికే అందుకు సంబంధించిన స్టోరీ లైన్ లాక్ చేసాము దానికి సంబంధించిన స్క్రీన్ పై రాయాలి అందుకు ఒక ఆరు నెలల సమయం పడుతుంది అని చెప్పుకొచ్చారు.

Advertisement