అప్పుడే లాభాల్లోకి 'మేజర్' మూవీ.. నిర్మాతలు ఖుష్..

ఎప్పటి నుండో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో మేజర్ ఒకటి.

ఈ సినిమాను మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ అయినా జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ తో కలిపి నిర్మించాడు.

మహేష్ బాబు ఈ సినిమాలో భాగం కావడంతో ముందు నుండి మహేష్ అభిమానులు సైతం ఈ సినిమాపై ద్రుష్టి పెట్టారు.అయితే ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది.

కానీ కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది.ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదల అయ్యింది.

జూన్ 3న మేజర్ సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుని దూసుకు పోతుంది.ఈ సినిమా ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది.

Advertisement

దీంతో ఈ సినిమా రెండవ వారంలోకి అడుగు పెట్టినా కూడా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతూ అందరిని ఆశ్చర్య పరుస్తుంది.ఈ సినిమాలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ హీరోగా నటించాడు.

శశి కిరణ్ తిక్క దర్వకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ముందు నుండే భారీ అంచనాలను నెలకొల్పింది.ఆ అంచనాలను ఏ మాత్రం వమ్ము చేయకుండా ఈ సినిమా పాజిటివ్ టాక్ తో రన్ అవుతుంది.

ఈ సినిమాను రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు.

అయితే ఈ సినిమా అప్పుడే నిర్మాతలకు కాసుల పంట పండించినట్టు తెలుస్తుంది.టోటల్ ఈ సినిమా బిజినెస్ కు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.ఈ సినిమాను మొత్తం 35 కోట్ల ఖర్చుతో నిర్మించగా.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide
వ‌ర్షాకాలంలో నైట్ ఈ విధంగా పాల‌ను తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!

థియేట్రికల్ బిజెనెస్ మాత్రం 27 కోట్లు మాత్రమే జరిగిందట.అయితే నాన్ థియేట్రికల్ రైట్స్ మాత్రం భారీ ధరతో అమ్ముడవ్వగా మంచి ప్రాఫిట్స్ వచ్చాయట.

Advertisement

ఓటిటి హక్కులను నెట్ ఫ్లిక్స్ ఏకంగా 16 కోట్లకు కొనుగోలు చేసిందట.అలాగే తెలుగు సాటిలైట్ హక్కులు 7 కోట్లు, హిందీ సాటిలైట్ హక్కులు 8 కోట్లు ఇంకా మ్యూజిక్, మలయాళం సాటిలైట్ హక్కులు ఒక్కో కోటి చొప్పున జరుగగా మొత్తం 33 కోట్లు ఇక్కడే వచ్చేసాయి.

దీంతో ఈ సినిమా ఇక్కడే భారీ లాభాలను అందుకుందని సమాచారం.మొత్తానికి మహేష్ నిర్మాతగా మొదటి సినిమానే లాభాలు అందుకున్నాడు.