ఉదయ్ కిరణ్ చావుకు అదే కారణం... ఇండస్ట్రీ పాలిటిక్స్ పై ఆదిత్య ఓం షాకింగ్ కామెంట్స్!

బిగ్ బాస్ 8 ( Bigg Boss 8 )కంటెస్టెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినీ నటుడు ఆదిత్య ఓం (Aditya Om) గతవారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇలా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన ఈయన వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఉదయ్ కిరణ్ ( Uday Kiran ) గురించి ప్రస్తావనకు వచ్చింది.ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ మరణం గురించి ఆదిత్య ఓం చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఉదయ్ కిరణ్ టాలెంటెడ్, సక్సెస్ పుల్ హీరో.అయితే. సక్సెస్ లో ఉన్న వ్యక్తికి సడెన్ గా ఫెయిల్యూర్స్ రావడంతో ఆ సిచ్యూవేషన్స్ తట్టుకోలేకపోయారు.

దాదాపు తనకు అదే పరిస్థితి వచ్చిందని తెలిపారు.అయితే నేను రైటర్ గా ఉండడంతో అటువైపు వెళ్లిపోయానని తెలిపారు.

Advertisement

సినిమా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగడం కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగితేనే వారి జీవితం ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు.

హీరోగా చేస్తే హీరో గానే ఇండస్ట్రీలో కొనసాగాలి.ఒకవేళ అవకాశాలు రాక సినిమాలు చేయకపోతే సినిమాలు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తారు.ఒకవేళ ఫ్లాప్ అయితే ఎందుకు సక్సెస్ కాలేదు అంటూ ప్రశ్నిస్తారని ఆదిత్య ఓం తెలిపారు.

హీరోగా ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటే వారికి మెంటల్ హెల్త్ బాగుండాలని తెలిపారు.ఉదయ్ కిరణ్ ఈ పరిణామాలు తట్టుకోలేకపోయాడు.

నాతో రెండు సినిమాలు చేసిన విజయ్ సాయి కూడా ఇలానే సూసైడ్ చేసున్నారు.హీరోలుగా కొనసాగాలంటే మెంటల్ హెల్త్ బాగుండాలని లేకపోతే చాలా కష్టమని తెలిపారు.

కమలా హారిస్‌తో మరో డిబేట్ లేనట్లేనా.. హింట్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్
నేషనల్ అవార్డ్ అందుకుని ఎమోషనల్ పోస్ట్ పెట్టిన రిషబ్ శెట్టి.. పోస్ట్ లో ఏమన్నారంటే?

ఇక ఇండస్ట్రీలో జరిగే పాలిటిక్స్ గురించి కూడా ఈయనకు ప్రశ్న ఎదురయింది.ఇండస్ట్రీ పాలిటిక్స్( Industry Politics ) గురించి అంటే నేనేం చెప్పలేను కానీ మాకైతే ఒక మంచి ఫ్లాట్ ఫామ్ దొరికింది అంటూ ఈ సందర్భంగా ఆదిత్య ఓం చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు