Siddharth : హీరోయిన్స్ ఎవరైనా సిద్ధార్థ్ కి అంత తొందరగా ఎలా పడతారో తెలుసా ?

అదితి రావు హైదరి( Aditi Rao Hydari ).

భాగ్యనగరంలో పుట్టిన అదితి చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోవడంతో ఢిల్లీలో( Delhi ) పెరగాల్సి వచ్చింది ఈ అమ్మడు.

అయితే ఆమె 17 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడి 24 ఏళ్లకె పెళ్లి చేసుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన పెళ్లి గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది.కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆ వివాహ బంధం ముగిసిపోయింది.

ప్రస్తుతం విడిపోయిన కూడా తన మొదటి భర్తతో సన్నిహితంగానే ఉంటాను అంటుంది అదితి.ఇక ఆమె పేరులో ఉన్న రావు మరియు హైదరి రెండు కూడా తల్లిదండ్రుల నుంచి సంక్రమించగా ఆమె తల్లి పేరు విద్యా రావు, తండ్రి పేరు ఎహసాన్ హైదరీ.

Adithi Rao Hydari About Hero Siddharth

ఇక ప్రస్తుతం ఆమె సిద్ధార్థ్( Siddharth ) తో ప్రేమాయణం కొనసాగిస్తుందన్న విషయం అందరికీ తెలుసు.ఈ ప్రేమపై సోషల్ మీడియాలో మాత్రం ఎవరికి నమ్మకం లేదు.ఎందుకంటే ప్రేమలో పడడం అదితి రావు హైదరీకి కొత్తేమో కానీ సిద్ధార్థ్ కాదు.

Advertisement
Adithi Rao Hydari About Hero Siddharth-Siddharth : హీరోయిన్స�

ఆయన ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ తో ప్రేమాయణాలు కొనసాగించి త్వరగానే వాటికి ముగింపు పలికేశాడు.ప్రస్తుతం హైదరితో ప్రేమలో ఉన్న కూడా అది ఎన్నాళ్లు సాగుతుందా అని అనుమానం మాత్రం అందరిలో ఉంది.

సిద్ధార్థ్ యొక్క ప్రేమాయణాల సంగతి కూడా అదితీ రావ్ హైదరికి తెలియదు అనుకోవడానికి లేదు.ఎందుకంటే ఇండస్ట్రీలో సిద్ధార్థ్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు.

Adithi Rao Hydari About Hero Siddharth

అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే సిద్ధార్థ్ లో మంచి హ్యూమర్ ఉంటుంది.ఆయన ఎప్పుడు తన చుట్టూ ఉండే వారిని నవ్విస్తూ ఉంటాడు.అందువల్ల హీరోయిన్స్ అయినా లేదా అమ్మాయిలు అయినా అతడికి తొందరగా పడిపోతారు అని ఒక వార్త ఎప్పటి నుంచో ఉంది.

చివరికి అదితి రావు హైదరి కూడా ఇటీవల ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండడానికి గల కారణం ఏంటి అని అడిగితే ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా సిద్ధార్థ్ పేరు చెప్పింది.అంటే దాన్నిబట్టి అదితి సిద్ధార్థ్ ని ఎంతగా నమ్ముతుందో మనం అర్థం చేసుకోవచ్చు.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు