ఆ టైటిల్ పెట్టి అలా చేసి ఉంటే ఆదిపురుష్ బ్లాక్ బస్టర్ అయ్యేదా.. ఏమైందంటే?

ఆదిపురుష్( Adipurush ) సినిమా వివాదాలతో మొదలై రిలీజ్ తర్వాత కూడా వివాదాలతో కొనసాగుతుండటం గమనార్హం.

ప్రభాస్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఆ ఆశలను పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఆదిపురుష్ అనే టైటిల్ విషయంలోనే తప్పు జరిగిందని కొంతమంది చెబుతున్నారు.శ్రీరాముడి పేరు ఆదిపురుష్ అని ఎక్కడా ప్రస్తావించలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమాకు జై శ్రీరామ్ పర్ఫెక్ట్ టైటిల్ అని ఆ టైటిల్ ను ఫిక్స్ చేసి ఉంటే ఈ సినిమాకు మేలు జరిగి ఉండేదని కొంతమంది చెబుతున్నారు.మరోవైపు ఓం రౌత్ ఆదిపురుష్ ను తన ఊహలకు అనుగుణంగా కాకుండా, ఎవరి మనోభావాలను కించపరచకుండా టెక్నాలజీని( Technology ) ఉపయోగించి ఇంతే అద్భుతంగా తెరకెక్కించి ఉంటే ఆదిపురుష్ సినిమాతో ఓం రౌత్ ఇండస్ట్రీ హిట్ సాధించేవారని చెప్పవచ్చు.

అలా చేసి ఉంటే ఆదిపురుష్ మూవీ ఈ స్థాయిలో వివాదాల్లో సైతం చిక్కుకుని ఉండేది కాదు.మేకర్స్ ఈ సినిమా విషయంలో ఇంత పెద్ద పొరపాట్లు ఏ విధంగా చేశారో అర్థం కావడం లేదు.ప్రభాస్( Prabhas ) అయినా ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి ఉంటే ఈ సినిమా రిజల్ట్ మెరుగ్గా ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

ఆదిపురుష్ సినిమాపై వివాదాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు వ్యక్తమవుతూ ఉండటంతో రాబోయే రోజుల్లో ఈ సినిమా ప్రదర్శనకు ఆటంకాలు ఎదురైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రభాస్ స్పందిస్తే ఈ సినిమాపై నెగిటివిటీ కొంతమేర తగ్గే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మైథలాజికల్ సినిమాలను తెరకెక్కించే వాళ్లను ఆదిపురుష్ మూవీ భయపెట్టిందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

ప్రభాస్ సైతం ఇలాంటి ప్రాజెక్ట్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంది.

ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?
Advertisement

తాజా వార్తలు