తెలుగు రాష్ట్రాల వరకు సంచలనాలు సృష్టించిన సినిమాలలో బాహుబలి,( Baahubali ) ఆర్ఆర్ఆర్ ( RRR ) సినిమాలు ముందువరసలో ఉంటాయి.
ఈ సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంతో పాటు రికార్డులను క్రియేట్ చేశాయి.
ఈ సినిమాలకు స్టార్ డైరెక్టర్ రాజమౌళి( Rajamouli ) దర్శకత్వం వహించారు.అయితే రాజమౌళి రికార్డులు ఎప్పుడు బ్రేక్ అవుతాయా? అని ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయనే విషయం తెలిసిందే.అయితే ఆదిపురుష్ మూవీ( Adipurush Movie ) బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులను పటాపంచలు చేస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ప్రముఖ సెలబ్రిటీలు ఈ సినిమాల టికెట్లను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఆదిపురుష్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో టికెట్లు దొరకడం లేదు.త్రీడీ సౌకర్యం ఉన్న థియేటర్లు ఇప్పటికే హౌస్ ఫుల్ బోర్డులతో నిండిపోయాయి.
అయితే పాజిటివ్ టాక్ వస్తే ఆదిపురుష్ మూవీ రికార్డులను బ్రేక్ చేయడం కష్టం కాదు.రామాయణం గురించి తెలుసుకోవడానికి ఈ జనరేషన్ పిల్లలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు.ఆదిపురుష్ లాంటి సినిమాలు పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ నచ్చే ఛాన్స్ అయితే ఉంది.
కళ్లు చెదిరే గ్రాఫిక్స్ తో తెరకెక్కడంతో ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.
ఆదిపురుష్ సినిమాకు భక్తిభావంతో వెళ్లాలని కొంతమంది వాట్సాప్ యాప్ లలో మెసేజ్ లను తెగ వైరల్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఆదిపురుష్ సినిమా పాటలు సైతం క్లిక్ అయ్యాయి.భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల ప్రేక్షకులను ఆదిపురుష్ మెప్పించే ఛాన్స్ అయితే ఉంది.
ఓం రౌత్ టేకింగ్ బాగుంటే మాత్రం ఆదిపురుష్ మూవీకి తిరుగుండదని చెప్పవచ్చు.ఆదిపురుష్ మూవీలో కొత్త తరహా ట్విస్టులు ఏమీ ఉండవు.అయితే కథ, కథనాన్ని ఆసక్తికరంగా చూపించాలని ఓం రౌత్ ప్రయత్నించారని తెలుస్తోంది.
ఆదిపురుష్ కొత్త రికార్డులను క్రియేట్ చేయడానికి ఎంతో సమయం పట్టదని కొంతమంది చెబుతున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy