ఆ కారణంతోనే హైపర్ ఆది నా టీమ్ నుంచి వెళ్ళిపోయాడు: అదిరే అభి

బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమాలలో జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.

ఈ కార్యక్రమం ద్వారా పలువురు తమ అద్భుతమైనటువంటి కామెడీ స్కిట్లతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.

ఇక ఈ కార్యక్రమంలో సక్సెస్ అందుకున్నటువంటి వారిలో హైపర్ ఆది( Hyper Aadi ) ఒకరు.ఈయన కెరియర్ మొదట్లో అదిరే అభి( Adire Abhi) టీంలో కమెడియన్ గా చేసేవారు.

అనంతరం స్క్రిప్ట్ రైటర్ గా మారి అభి టీంలో పని చేస్తున్నటువంటి ఆది అనంతరం టీం లీడర్ గా మారిపోయారు.

హైపర్ ఆది రైజింగ్ రాజు టీం ద్వారా ఈయన ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.అయితే అభి దగ్గర పని చేస్తున్నటువంటి ఆది పక్కకు వెళ్లడానికి ఇద్దరి మధ్య వచ్చిన విభేదాలే కారణం అంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అభి ఆదితో తనకు ఉన్నటువంటి విభేదాల గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఈ సందర్భంగా అభి మాట్లాడుతూ ఆది నా టీం నుంచి వెళ్లిపోవడానికి ఎలాంటి విభేదాలు కారణం కాదని తెలిపారు.కొత్త టీమ్స్ ఏర్పాటు చేయడం కోసం రెండవ స్థానంలో ఉన్నవాళ్లను బయటకు తీశారు.ఆ విధంగా నా టీమ్ నుంచి హైపర్ ఆది బయటకు వెళ్లారని అంతకుమించి మా మధ్య ఏ విధమైనటువంటి గొడవలు లేవని అభి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఆది ప్రస్తుతం ఈ కార్యక్రమానికి దూరమయ్యారు కానీ ఇతర షోలలో సందడి చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.మరో వైపు సినిమాలలో కూడా నటిస్తున్నారు.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు