బరువు తగ్గడానికి రోజు జిమ్ లో చెమటలు చిందిస్తున్నారా? అయితే మీ డైట్ లో ఇది ఉండాల్సిందే!

ప్రస్తుత రోజుల్లో అధిక బరువు అనేది చాలా మందికి అతి పెద్ద శత్రువుగా మారింది.

ఈ నేపథ్యంలోనే బరువు తగ్గడం కోసం ప్రతి రోజు జిమ్ లో కఠినమైన వ్యాయామాలు చేస్తూ చెమటలు చిందిస్తుంటారు.

మీరు ఈ లిస్టులో ఉన్నారా.? అయితే తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే స్మూతీని మీ డైట్ లో చేర్చుకోవాల్సిందే.ఈ స్మూతీ మ‌రింత వేగంగా బరువు తగ్గడానికి ఎంత‌గానో సహాయపడుతుంది.

అలాగే మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ ను కూడా అందిస్తుంది.మరి ఇంతకీ ఆ స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్‌ మరియు ఒక కప్పు వాటర్ ను వేసుకుని ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.ఈ లోపు ఒక క్యారెట్ ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

Advertisement

అలాగే రెండు స్ట్రాబెరీలను తీసుకుని వాటర్ తో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ లో కట్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీ ముక్కలు, క్యారెట్ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ పెరుగు, ఒక గ్లాస్ వాటర్, రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో నానబెట్టుకున్న చియా సీడ్స్ ను మిక్స్ చేస్తే మన సూపర్ టేస్టీ అండ్ హెల్తీ స్మూతీ సిద్ధమవుతుంది.

రెగ్యులర్ డైట్ లో ఈ స్మూతీని చేర్చుకుంటే మెట‌బాలిజం రేటు అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.అతి ఆకలి దూరం అవుతుంది.దీంతో వేగంగా బరువు తగ్గుతారు.

పైగా ఈ స్మూతీని తీసుకోవడం వ‌ల్ల‌ ఎముకలు కండరాలు దృఢంగా మారతాయి.రక్తహీనత దూరం అవుతుంది.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

గుండెపోటు, మధుమేహం వంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.చర్మం నిగారింపుగా ఆకర్షణీయంగా మెరుస్తుంది.

Advertisement

హెయిర్ ఫాల్ సమస్య సైతం కంట్రోల్ అవుతుంది.

తాజా వార్తలు